Breaking News

Save the date అనంత్‌-రాధిక పెళ్లి ముహూర్తం ఫిక్స్‌, వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

Published on Thu, 05/30/2024 - 15:25

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మోస్ట్‌ ఎవైటెడ్‌ వెడ్డింగ్ డేట్‌ వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సాంప్రదాయ హిందూ వైదిక పద్ధతిలో వివాహ వేడుక జరగనుంది. ఏఎన్‌ఐ తన అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన కార్డును షేర్‌ చేసింది.  

అంబానీ కుటుంబం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ 'సేవ్ ది డేట్'  పేరుతో వీరి వెడ్డింగ్‌ ఆహ్వానాలు వైరల్‌గా మారాయి. మూడు రోజుల వేడుకకు సంబంధించిన వివరాలతో ఎరుపు, బంగారు రంగులో చూడముచ్చటగా ఉంది.

బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో  జూలై 12, 13 , 14 తేదీల్లో మూడు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ప్రధాన వేడుకలు జూలై 12వ తేదీ శుక్రవారం శుభ వివాహ్‌ లేదా వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. జూలై 13న, శుభ్ ఆశీర్వాదం లేదా దైవిక ఆశీర్వాద వేడుక, జూలై 14న మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరుగుతుంది.

కాగా లవ్‌ బర్డ్స్‌ అనంత్‌-రాధిక  ఇప్పటికే నిశ్చితార్థాన్ని, తొలి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను ఘనంగా ముగించుకున్నారు.  ఇక రెండో  ప్రీ వెడ్డింగ్‌ వేడుక లగ్జరీ ‍క్రూయిజ్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  వీరి వెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రముఖులు, దేశాధినేతలు, అలాగే  పలువురు హాలీవుడ్ , బాలీవుడ్ తారలు హాజరుకానున్నారని తెలుస్తోంది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)