Breaking News

ఆరునెలల్లోనే 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గాడు..ఏం చేశాడంటే..?

Published on Thu, 08/15/2024 - 16:10

ప్రపంచంలోనే అత్యంత బరువుగా ఉన్న రెండో వ్యక్తిగా ఖలీద్‌ బిన్‌ మొహసేన్‌ షరీ అనుహ్యంగా కిలోల కొద్ది బరువు తగ్గాడు. అదికూడా స్వలం కాలంలోనే అన్ని కిలోలు బరువు తగ్గి ఆశ్యర్యపరిచాడు. అంతలా బరువు తగ్గినందుకు గానూ ఖలీద్‌ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసి తన బరువుని తగ్గించుకున్నాడు. అందుకు సౌదీ అరేబియా రాజు ఎలాంటి సాయం అందించాడు తదితరాల గురించి సవివరంగా చూద్దాం. 

ఒకప్పుడూ సజీవంగా ఉన్న అత్యంత బరువైన రెండో వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్‌ సుమారు 546 కిలోల బరువు తగ్గాడు. 2013 వరకు ఖలీద్‌ బరువు 610 కేజీలు ఉండేవాడు. ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులపై ఆధారపడే స్థాయికి అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్‌ దుస్థితిని చూసి చలించిపోయిన సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్‌లిఫ్ట్‌ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన బెడ్‌ని ఉపయోగించి రియాద్‌లోని షహద్‌ మెడికల్‌ సిటీకి తీసుకొచ్చారు.

కఠినమైనమైన ఆహార నియమావళితో చికిత్సను ప్రారంభించారు. దీన్ని అ‍మలు చేసేలా సుమారు 30 మంది వైద్య నిపుణుల బృందాన్ని నియమించారు. అంతేగాదు ఖలీద్‌ చికిత్సలో భాగంగా గ్యాస్ట్రిక్‌  బైపాస్‌ సర్జరీ, కస్టమైజ్డ్‌ డైట్‌, ఎక్సర్‌సైజ్ ప్లాన్‌, ఇంటెన్సివ్‌ ఫిజియోథెరపీ సెషన్‌లు వంటివి అందించారు. ప్రముఖ నిపుణులు సాయంతో ఖలీద్‌ బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూశాడు. 

అంతేగాదు ఖలీద్‌ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం బరువును కోల్పోయాడు. చెప్పాలంటే 2023 నాటికి 542 కేజీలు తగ్గి ఆరోగ్యకరంగా 63.5 కిలోలకు తగ్గాడు. ఇక్కడ ఖలీద్‌ అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది. ఎందుకంటే కొత్త శరీర ఆకృతికి అనుగుణంగా చర్మం ఉండదు. అంతేగాదు ఖలీద్‌ని వైద్యులు "ది స్మైలింగ్ మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు.

(చదవండి: ఫుడ్‌ మెమొరీస్‌.. విభజన టైంలో ఈ వృద్ధుల ‘చేదు’ అనుభవాలు!)

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)