Breaking News

చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్‌ ఫ్యాషన్‌ షో!

Published on Mon, 05/20/2024 - 18:39

సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్‌ ఫ్యాషన్‌ షోని భారీ ఎత్తున నిర్వహించింది.  ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. 

ఈ స్విమ్‌సూట్‌ ఫ్యాషన్‌ గత శుక్రవారమే సెయింట్‌ రెజిస్‌ రెడ్‌ సీ రిసార్ట్‌లోని రెడ్‌సీ ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్‌ యాస్మినా క్వాన్జల్‌ వన్‌ పీస్‌ ఎరుపు రంగు స్విమ్‌సూట్‌, నీలరంగులో స్వీమ్‌సూట్‌లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్‌ ధరించారు.  ఈ క్రమంలో డిజైనర్‌ క్వాన్జల్‌ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్‌ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్‌. 

అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్‌ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్‌ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్‌ చేస్తోంది.

ఎన్నో సంస్కరణలు..
ప్రిన్స్‌ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. 

ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్‌ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్‌లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్‌ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.

2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్‌ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.

 

(చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్‌నెస్‌ కోచ్‌ ఏమంటున్నారంటే..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)