Breaking News

చీరకు జెండర్‌ లేదు!

Published on Sat, 05/02/2026 - 04:13

నారీ వార్డ్‌రోబ్‌ లిస్ట్‌లో ఉండే ఎవర్‌గ్రీన్‌ డ్రెస్‌.. శారీ. ఇప్పుడిక మగవారి అలంకరణలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. సంప్రదాయ దుస్తులలో ఈ కళ కొత్తగా మెరిసిపోతోంది. ధోతీగా మారి దావత్‌లలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవుతోంది. జెండర్‌ పరిమితులు లేని ఈ స్టైల్‌కి జనాల నుంచి కితాబులూ అందుకోవచ్చు.

ఆరు గజాల చీర ఆడవారి ఆహార్యానికే కాదు, మగవారి రాజసానికి కూడా అలంకరణగా మారింది. యూనీసెక్స్‌ డిజైన్స్‌లో మేటిగా నిలిచింది. సంప్రదాయ వేడుకలలో స్టైలిష్‌గా నిలుస్తోంది. పట్టు, కాటన్, ఆర్గంజా., శారీస్‌ లేదా దుపట్టాలతో  షర్ట్, ఓవర్‌ కోట్లను డిజైన్‌ చేయవచ్చు.. బ్లేజర్‌ కోసం చీర పల్లూను వాడచ్చు. డిజైన్‌ బట్టి ఒకే చీరను కుర్తా, పైజామా సెట్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు దళసరిగా ఉండే పట్టు, కాటన్‌ శారీస్‌లో అందమైన డిజైన్స్‌ ఉన్నవి ఎంచుకోవాలి. చీర కొంగును షర్ట్‌ కాలర్, కఫ్ట్, పాకెట్స్‌ డిజైన్‌ చేయడానికి ఉపయోగించవచ్చు. అంతగా ఉపయోగించని, మంచి డిజైన్‌ ఉన్న శారీస్‌తోనూ మెన్‌ అండ్‌ ఉమెన్‌ సంప్రదాయ దుస్తులను రూపొందించవచ్చు.

కట్టులో ఎన్నో వైవిధ్యాలు
ఈ రోజులను గమనిస్తే 40 ఏళ్ల లోపు మెన్‌ అండ్‌ ఉమెన్‌ వేర్, యాక్ససరీస్‌ చాలా వరకు ఒకే మోడల్స్‌లో ఉంటున్నాయి. హారమ్‌ ప్యాంట్స్‌/ ధోతీ అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు, అబ్బాయిలు కూడా వాడుతున్నారు. వీటిమీదకు ఇద్దరూ టీ షర్ట్స్, షార్ట్‌ కుర్తీలూ, షర్ట్స్‌ వేసుకుంటున్నారు.

→ బ్లేజర్స్, టీ షర్ట్స్, ధోతీ, టులిప్‌ ప్యాంట్స్‌... ఇలా జెండర్‌ లేకుండా యూనీసెక్స్‌ డిజైన్‌ మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఇది డ్రెస్సులకే కాదు కళ్లద్దాలు, వాచీ, ఫుట్‌వేర్‌ విషయంలో కూడా ఇద్దరి డిజైన్స్‌ ఒకేలా ఉంటున్నాయి. 

→ చీరలను కట్‌ చేసి, కుట్టడం అనే ఆలోచన కూడా దూరమై చీరలనే ధోతీలుగా, లుంగీలుగా కట్టుకుంటున్నారు. ఇందుకు కాటన్, ప్రింటెడ్, సిల్క్‌... ఇలా ఏ శారీ అయినా ధోతీలాగా మార్చుకుంటున్నారు. ఇలా సంప్రదాయ వేడుకలు, పండుగలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీటి మీదకు షార్ట్, లాంగ్‌ కుర్తీలు, బ్లేజర్లు వేసుకోవచ్చు. 

→ సాధారణంగా ఆడవాళ్లు నాలుగుసార్లు కట్టాక ఆ చీరను మళ్లీ కొన్నాళ్ల పాటు కట్టరు. అలాగని, ఆ చీరను కట్‌ చేసి, కుట్టడం అనే దానిని ఆడవాళ్లు ఇష్టపడరు. అందుకని, చీరను ధోతీ, ప్యాంట్‌లాగా విభిన్న పద్ధతులలో కట్టుకుంటున్నారు. చీరను ధోతీలాగా ఎలా కట్టుకోవచ్చో సోషల్‌మీడియాలో చూసి, తెలుసుకోవచ్చు. దీనికి నడుము భాగంలో బెల్ట్‌ సెట్‌ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది.

బెనారస్‌ చీరతో ధోతీ
ఇటీవలి నా వివాహానికి రెడీమేడ్‌గా ఉండే కుర్తా పైజామా, ధోతీ డ్రెస్సులను షాపుల్లోనూ, బొటిక్‌లలోనూ చూశాను. ఏదైనా స్పెషల్‌గా డిజైన్‌ చేయించుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. పెళ్లికి మా అమ్మ కొన్న చీరలను చూసినప్పుడు బ్లూ బెనారస్‌ శారీ భలే ఆకర్షణీయంగా అనిపించింది. ఆ చీరతో ఏమైనా స్పెషల్‌ చేయవచ్చా... అని ఆలోచించాను. ఆన్‌లైన్‌లో కనిపించే సంప్రదాయ దుస్తుల డిజైన్స్‌ చూశాను. టైలర్‌ని కలిసి, నా ఆలోచనను చెప్పాను. ధోతీ, కండువా చేయడానికి టైలర్‌ ఒప్పుకున్నారు. అలా చీర మిడిల్‌ పార్ట్‌తో ధోతీ చేయించాను.

 పల్లూ, బార్డర్‌ వంటివి  ఉపయోగించి దుపట్టా డిజైన్‌ చేయించాను. కుర్తా కోసం కాంబినేషన్‌ క్లాత్‌ కోసం వెతికితే ఆ కలర్‌ మార్కెట్లో దొరకలేదు. దీంతో వైట్‌ క్లాత్‌ తీసుకొని, లైట్‌ షేడ్‌ వచ్చేలా డై చేయించాను. ఆ క్లాత్‌తో కుర్తా పూర్తయ్యింది. ఈ సెట్‌కి లైనింగ్‌ వేయించడం వల్ల డ్రెస్‌కి మంచి ఫాలింగ్‌ వచ్చింది. సాధారణంగా పెళ్లికి మెన్‌ ట్రెడిషనల్‌ వేర్‌కి 50 వేల రూపాయల నుంచి బడ్జెట్‌ అవుతుందని చెప్పా,రు. నేను ఇలా డిజైన్‌ చేయించుకోవడం వల్ల పాతిక వేల రూపాయలలో డ్రెస్‌ పూర్తయ్యింది. పెళ్లిలో ఈ యునిక్‌ డిజైన్‌ గురించి చాలా మంది అడిగారు. 

– కృష్ణ సందీప్‌

Videos

సొంత టీడీపీ కార్యకర్తపైనే... ప్రశ్నించాడని పోలీసులతో ఈడ్చుకెళ్లి.. బండారు శ్రావణి రెడ్ బుక్ రూల్

ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్

ORR కారు ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి

అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..

నన్ను ఎందుకు ఇలా తిప్పుతున్నారో నాకే అర్ధం కావట్లేదు.. రిలీజ్ తర్వాత శ్రీహరి రియాక్షన్

ORRపై ప్రమాదం ఎలా జరిగిందో చూడండి.. AI Video

ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి

బెడ్ పై మహిళతో CI.. బెడ్ రూమ్ వీడియో వైరల్..

వాహనదారులకు బిగ్ షాక్.. త్వరలో పెట్రో బాదుడు!

Photos

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు