Breaking News

పియర్సింగ్ సర్వీస్ గురించి తెలుసా..! సానియా మీర్జా..

Published on Tue, 11/19/2024 - 11:32

పియర్సింగ్‌ సర్వీస్‌ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్‌లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్‌ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు. 

పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్‌గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించు​కోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్‌ సర్వీస్‌ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్‌తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్‌​ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో సానియా దుబాయ్‌లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్‌ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్‌ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి  "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్‌తో నెట్టింట పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది.

పియర్సింగ్‌ సర్వీస్‌:
ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్‌ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్‌తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్‌ ఒక్క కాల్‌తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్‌ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు. 

ఇలాంటి హై రేంజ్‌ సర్వీస్‌ దుబాయ్‌, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్‌ సాంకేతికతో స్టడ్‌​చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్‌లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్‌ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా సర్వీస్‌ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్‌గా చెవులు కుట్టేస్తారు.

 

(చదవండి: 'లాస్ట్‌ హోప్‌ కాదు... బెస్ట్‌ కేర్‌'..!)
 

 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)