Breaking News

ఉద్యోగానికి గుడ్‌బై.. సేవే అసలైన విజయం!

Published on Thu, 08/06/2026 - 03:59

స్విట్జర్లాండ్‌లో చేస్తున్న కార్పొరేట్‌ ఉద్యోగాన్ని, ఆర్థిక భద్రతను, సకల సౌకర్యాలనూ వదిలి ఇండియాను వెదుక్కుంటూ వచ్చిన సాండ్రా లావి గోజ్కోవిచ్‌ ఇక్కడ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతోంది. ‘ఇండియాలో నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అని లావి ఒక ప్రణాళిక వేసుకొని రాలేదు. ఇక్కడ ఆమె అడుగు పెట్టిన తరువాత ఊహించని ప్రణాళిక పుట్టింది. ఆ ప్రణాళికలో నుంచే తన జీవిత లక్ష్యం రూపుదిద్దుకుంది..

పశ్చిమబెంగాల్‌లోని ఒక గ్రామంలో ఒక స్కూల్‌ ప్రారంభించి పేద పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టిన లావి సాండ్రా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేసింది. మానవ అక్రమరవాణ, గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పింది. తమ కుటుంబాల్లో మార్పు తెచ్చే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.

తాజా విషయానికి వస్తే...
తన జీవితంలోని కొన్ని విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది లావి సాండ్రా. కార్పొరెట్‌ బోర్డ్‌ రూమ్‌ను వదిలి భారతదేశంలోని మారుమూల ప్రాంత స్కూల్‌ రూమ్‌లోకి ఎలా వచ్చిందో వివరించింది. గ్రామస్తుల నమ్మకాన్ని చూరగొనడం లాంటి సవాళ్లు ఎన్నో ఆమెకు ఎదురయ్యాయి.

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటైన జ్యూరీచ్‌లో పెరిగిన లావి తన బాల్యం చాలా సంతోషంగా గడిచింది అని చెబుతుంటుంది. తల్లిదండ్రులు ఏది కాదనకుండా ఇచ్చారు. అందులో ఒకటి... ప్రపంచాన్ని చూసే అవకాశం.

‘ప్రయాణాల వల్ల ఎన్నో సంస్కృతులను చూసే అవకాశం వచ్చింది. తల్లిదండ్రులు నాకు ఇచ్చిన విలువైన బహుమానం... ప్రయాణించే అవకాశం’ అంటుంది లావి. ఆ ప్రయాణాలలో ఒక జ్ఞాపకం ఆమె మదిలో స్థిరంగా నిలిచిపోయింది. చెప్పులు లేకుండా నడిచి వెళుతున్న ఒక పేద బాలికను చూసి బాధ పడిన లావి తన బూట్లను ఆ అమ్మాయికి ఇచ్చేసింది.

‘పంచడంలోని ఆనందం నాకు తొలిసారిగా తెలిసొచ్చిన క్షణం అది’ అని గుర్తు తెచ్చుకుంటుంది లావి.
‘ఎంతోమందికి కనీస సౌకర్యాలు లేవు. నాలాంటివారికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలా?’ అనే ప్రశ్న ఆమెను వెంటాడింది. సామాజిక సేవ రూపంలో కొత్త మార్గాన్ని చూపింది.

‘కెరీర్‌కు సంబంధించిన విజయం నాకు ఆర్థిక సౌకర్యం ఇచ్చింది కానీ, లక్ష్యాన్ని మాత్రం ఇవ్వలేదు అనే విషయాన్ని గ్రహించాను. ఈ క్రమంలోనే నా గురించి కాదు సమాజం గురించి ఎంతో కొంత పని చేయాలనుకున్నాను. అందుకే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు చొక్కాలు, రెండు ప్యాంట్‌లు సర్దుకొని ఇండియాకు వన్‌–వే టికెట్‌ కొనుక్కున్నాను’ అంటోంది లావీ.

Videos

NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు

తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం

భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg

హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్

జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు

దుబాయ్ గుండెలపై మిస్సైళ్ళ వరం

క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?

రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్

Photos

+5

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్..(ఫొటోలు)

+5

బ్లూ శారీలో టాలీవుడ్ నటి అనసూయ అందాలు (ఫొటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)

+5

అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)

+5

బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)

+5

హ హ హాసిని బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)