Breaking News

'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!

Published on Mon, 12/29/2025 - 17:36

ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్‌ హీరోహియిన్‌ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ టిప్స్‌ షేర్‌ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారామె. ఈసారి అలానే ఆరోగ్యకరమైన రెసిపీతో ముందుకొచ్చారు. తాను చేసే రెసిపి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరిస్తూ..ఆ కర్రీ తయార చేసే విధానాన్ని తెలియజేశారామె. ఇంతకీ ఏంటా హెల్దీ రెసిపీ అంటే..

సమీరా రెడ్డి కడుపుకి మేలు చేసే అరటికాండం పప్పు కూర తయారీ విధానాన్ని పంచుకున్నారు. అందుకోసం ఏమేమి పదార్థాలు కావాలంటే..

అరటి కాండం-1(శుభ్రం చేసి, సన్నగా తరిగి నానబెట్టింది)
కంది పప్పు లేదా పెసర పప్పు: ¼ కప్పు
కరివేపాకు 1
పసుపు టీ స్పూన్‌
ఆవాలు టీ స్పూన్‌
తాజా కొబ్బరి పేస్ట్‌-1
కాశ్మీరీ మిరపకాయ-1
జీలకర్ర- 1 టీస్పూన్‌
ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా అరటికాండం, పప్పు, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. మొత్తం 6 విజల్స్‌ వచ్చాక కొబ్బరి పచ్చిమిర్చి,జీలకర్ర కలిపిని పేస్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, కాశ్మీరీ మిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. అంతేగాదు దీన్నితినడం వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు. 

అవేంటంటే..

  • ఇందులో ఫైబర్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. 

  • అలసటను తగ్గించడంలో హెల్ప్‌ అవుతుంది

  • హార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుంది

  • ప్రేగు ఆరోగ్యం, డిటాక్స్ కోసం అద్భుతమైనది

  • కడుపు ఉబ్బరం, నీరు నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది

  • బరువు నిర్వహణకు సహాయపడుతుంది

  • రుతుక్రమ ఆరోగ్యానికి మంచిది

  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

  • జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. 

అలాగే పోస్ట్‌ చివరలో సమీరా ఉడికించిన తర్వాత ఆ అరటికాండం పోగులను తీసివేయాలని, అవి తినకూడదని, జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుందని హెచ్చిరించారు. అలాగే ఇలాగే ఇలా తొలగించడం వల్ల కూర మృదువుగా, మెత్తగా ఉండి సులభంగా తినేయగలుగుతామని కూడా అన్నారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

 

(చదవండి: తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! ఆ తర్వాత..)
 

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)