Breaking News

మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతా

Published on Wed, 01/29/2025 - 11:40

ఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.  రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది.  చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్‌ హీరోయిన్‌ సమంత  సోషల్‌ మీడియాలో వివరించింది.

ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం  ఆరోగ్యానికి చాలామందని సూచించింది.  నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది. 

ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్‌ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని  ఆలోచనల గురించి చింతించకండి.  వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది.


ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.
ధ్యానం  ఉదయం, సాయంత్రం,  నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్‌గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా   పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్‌స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్     అభిప్రాయం ప్రకారం  ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం  తేలింది.

ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్‌ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!

ధ్యానం, రకాలు
శ్రద్ధ ధ్యానం
ఆధ్యాత్మిక ధ్యానం
దృష్టి ధ్యానం
మంత్ర ధ్యానం
అతీంద్రియ ధ్యానం
లవింక్‌ కైండ్‌నెస్‌ ధ్యానం
విజువలైజేషన్; వాకింగ్‌ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి.
  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)