Breaking News

సిల్క్‌ చీరలో సమంత.. ఇది 1930ల నాటి స్టైల్‌!

Published on Fri, 06/13/2025 - 14:01

నటి సమంత రూత్‌ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్‌ డిజైనర్‌ వేర్‌లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్‌ ఫోటోలను నెటిజన్లతో షేర్‌ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది. ఆ సంప్రదాయ చీరలో స్టైలిష్‌గా కనిపిస్తున్న సమంత అనుసరించిన ఫ్యాషన్‌ శైలి 1930ల నాటిది. అంతేకాదండోయ్‌ నాటి గ్లామర్‌ స్టైల్‌కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ చీర డిజైనింగ్‌ చెప్పే అర్థం చూస్తే షాకవ్వుతారు. 

ఇక్కడ సమంత రా మ్యాంగో శాటిన్‌ సిల్క్‌ చీరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వావ్‌..! వాటే శారీ అనేలా ఉంది ఆమె లుక్‌. ఈ తాజా లుక్‌  1920-30ల ఛానెల్‌ ఆర్డ్‌ డెకో శైలి అట. అంటే..ఇక్కడ సమంత ధరించిన చీర ఆర్ట్‌ డెకో ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌. ఈ చీరపై కనిపించే బోల్డ్‌ లైన్లు, రేఖాగణిత నమునాలు, నిర్మాణ నైపుణ్యానికి సంబధించిన డిజైన్‌లో రూపొందిస్తారు. 

సింపుల్‌గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్‌కి సంబంధించిన గీతలే దర్శనమిస్తాయి. దీనిలో కనిపించే క్షితిజ సమాంతర రేఖలకు ప్రేరణ ఏరోడైనమిక్ డిజైన్ అని, ఇవి నాటికల్‌ అంశాలను కూడా నొక్కిచెబుతాయని అంటున్నారు ష్యాషన్‌ నిపుణులు. అయితే ఈ గీతలు, రేఖలు అన్ని చేతితో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్‌ అట. సున్నితమైన బంగారు జరీతో డిజైన్‌ చేస్తారట. 

చూడటానికి సాదాసీదాగా కనిపించే ఈ శారీని రిచ్‌లుక్‌లో ఉండి, రాచరికానికి అద్ధం పట్టే విలాసవంతమైన స్టైలిష్‌వేర్‌గా అభివర్ణిస్తారు ఫ్యాషన్‌ ప్రియులు. ఆ చీరకు తగ్గ మేకప్‌, చెవిపోగులు, కాక్‌టెయిల్‌ రింగ్‌తో తన రూపాన్ని అద్భుతంగా కనిపించేలా చేసింది సమంత. పాత ఫ్యాషన్‌కి సరికొత్త రూపమిచ్చేలా కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసేలా ఉంది సమంత వింటేజ్‌ ఆర్ట్‌ డెకో లుక్‌.  చాలా సింపుల్‌గా కనిపిస్తున్న ఈ శాటిన్‌ సిల్క్ చీర ధర వచ్చేసి సుమారు రూ. 50 వేలు పైనే పలుకుతుందట.

 

(చదవండి: ఎవరీ లీనా నాయర్‌? ఏకంగా బ్రిటిష్‌ అత్యున్నత గౌరవం..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)