Breaking News

దేవనాగరి చీరలో సమంత! కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్‌ కూడా..

Published on Tue, 01/31/2023 - 17:07

సమంత.. వైవిధ్యమైన నటి అని ప్రత్యేకంగా కితాబివ్వక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలు చూస్తే చాలు. అదే వైవిధ్యం ఆమె అనుసరించే ఫ్యాషన్‌లోనూ కనిపిస్తుంది. సాక్ష్యం ఇదిగో.. ఈ బ్రాండ్సే..!

దేవనాగరి..
ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్‌ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్‌ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్‌ డిజైనింగ్‌.

ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్‌ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ.

చాలామంది సెలబ్రిటీస్‌ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్‌ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ డిజైన్స్‌ లభిస్తాయి. 

లిండ్‌బర్గ్‌..
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో లిండ్‌ బర్గ్‌ ఐ వేర్‌ ఒకటి. డెన్మార్క్‌లో మెయిన్‌ ఆఫీస్‌ ఉంది. అత్యాధునిక డానిష్‌ డిజైన్‌ సూత్రాలపై  తయారుచేసే వీరి అందమైన, నాణ్యమైన  కళ్లజోళ్లకు ఇండియాలో మంచి గిరాకీ ఉంది.

112 అంతర్జాతీయ అవార్డులను ఈ బ్రాండ్‌ సొంతం చేసుకుంది. టైటానియం, ప్లాటినం, బంగారం, వెండి, వజ్రాలు పొదిగిన ఫ్రేమ్స్‌ కూడా ఇక్కడ లభిస్తాయి. అయితే, ఈ బ్రాండ్‌ కేవలం సంపన్నులకు మాత్రమే. ఇక్కడి ప్రారంభ ధరే రూ. లక్షకు పైగా ఉంటుంది. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్‌ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

నచ్చినట్లు ఉండు
నీకు నచ్చినట్లు నువ్వుండు. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. – సమంత 

బ్రాండ్‌ వాల్యూ
ఐ వేర్‌ బ్రాండ్‌: లిండ్‌బర్గ్‌
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 
చీర బ్రాండ్‌:  దేవనాగరి
ధర: రూ. 48,500 

చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే
Sudha Ravi: రెండ్రోజుల్లో ఫంక్షన్‌.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె స్పెషాలిటీ ఏంటి
?

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)