మాములు పెళ్లి వింత కాదు..! వరుడే పండితుడిగా మారి..

Published on Mon, 01/27/2025 - 14:14

పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!

ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని రాంపూర్‌కు చెందిన వివేక్‌ కుమార్‌ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు. 

మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది. 

ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్‌కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్‌ తొందరలో ఆత్మ నిర్భర్‌గా మారుతుందని తరుచుగా అనేవారు. 

ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: అద్భుతమైన వెయిట్‌ లాస్‌ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)