Breaking News

పత్తి యంత్రం రెడీ

Published on Tue, 02/24/2026 - 06:34

పత్తి తీయటంలో వ్యయప్రయాసలతో సతమతమవుతున్న రైతుల కష్టాలు గట్టెక్కే రోజులు వచ్చాయి. భోపాల్‌లోని సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ (ఐసీఏఆర్‌ – సీఐఏఈ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి తీసే యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఇటీవల రైతులకు అంకితం చేశారు. 

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) సమాచారం ప్రకారం.. ప్రీ–క్లీనింగ్‌ సిస్టమ్‌తో కూడిన ఈ యంత్రాన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించాలి. విత్తన పత్తిలో చెత్త 15% కంటే తక్కువగా ఉంటుంది. ఖరీదు రూ. 15 లక్షలు. దీంతో కిలో పత్తి తీత ఖర్చు రూ. 5కు తగ్గుతుంది. గంటకు 0.23 హెక్టారులో పత్తి తీసే సామర్థ్యం దీనికుంది. ఇప్పటి పద్ధతితో పోల్చితే 90% సమయం, 65% ఖర్చు ఆదా అవుతుంది. 

మంత్రి ‘ఎక్స్‌’లో ఇలా ట్వీట్‌ చేశారు.. ‘ఇప్పటివరకు చేతి వేళ్లతో పత్తిని తీస్తున్నారు. అందుకు చాలా సమయంతో పాటు అధిక శ్రమతో కూడిన పని. దాంతో రైతులకు ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. చాలా కాలంగా, రైతులు పత్తి తీసే ప్రక్రియను సులభతరం చేసే యంత్రం కావాలని అడుగుతున్నారు. నేడు వారి కోరిక నెరవేరింది. ఈ యంత్రం త్వరలో రైతులకు అందుబాటులోకి వస్తుంది.

 ఈ యంత్రంతో పత్తి తీసే పనిని నేను వ్యక్తిగతంగా పరిశీలించాను. సమయంతోపాటు ఖర్చులనూ తగ్గించడానికి, పత్తి సాగును మరింత లాభదాయకంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో, చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినివ్వగల కొత్త పత్తి రకాలను అభివృద్ధి చేస్తున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. 2 వరుసల్లో వత్తుగా విత్తిన పత్తి మొక్కల  (హెచ్‌డీపీఎస్‌) నుంచి సీజన్‌లో ఒకేసారి పత్తి తియ్యటానికి వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)