Breaking News

పావు ఎకరంలో.. ప్రకృతి విప్లవం!

Published on Fri, 07/24/2026 - 08:44

భగవతీ లాల్, రేఖ రసాయనాలు వాడకుండా ఏటా 30 రకాల పంటలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. పశువుల పేడ, మూత్రంతో సేంద్రీయ ఎరువులు తయారుచేస్తూ, తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణ, మంచి ఆరోగ్యం, స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

నీటి కొరతను జయించిన తీరు
ఎడారి సరిహద్దు ప్రాంతాల్లో నీటి కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి ప్రధాన అడ్డంకులు. ఈ సవాళ్లను అధిగమించడానికి భగవతీ లాల్‌ దంపతులు బహుళ అంతస్థుల్లో అనేక రకాల పంటలను కలిపి సాగు చేసే పద్ధతిని ఆశ్రయించారు.

  • నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి, తిరిగి నేలలోనే కలియదున్నారు. దీనివల్ల మట్టిలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

  • వివిధ ఎత్తుల్లో పెరిగే బొ΄్పాయి, అంజీర వంటి పండ్ల చెట్లతో పాటు వాటి నీడలో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. దీనివల్ల నేరుగా ఎండ తగలకుండా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతున్నారు.

  • నీటి ఎద్దడి ఉన్న సమయాల్లో కూడా ఈ సమగ్ర సాగు విధానం వల్ల పంటలు ఎండిపోకుండా నిలదొక్కుకుంటున్నాయి.

ఏడాదిలో 30 పంటలు
ఈ దంపతులు తమ చిన్న పొలంలోనే ఏడాది పొడవునా దాదాపు 30 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. మూడు ఆవులు, ఒక గేదెలను పెంచుకుంటూ పాలపై అదనపు ఆదాయం పొందుతున్నారు.

  • ఎటువంటి పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడరు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కీటక నాశక కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటారు. తమ పొలానికి కావలసిన దానికంటే ఎక్కువ సేంద్రియ ఎరువులను తయారుచేస్తున్నారు. తమ పొలంలో వాడగా మిగిలిన సేంద్రియ ఎరువులను పొరుగు రైతులకు అమ్ముతున్నారు.

ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ
ఈ నమూనాలో అత్యంత ముఖ్యమైన అంశం పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ నికర లాభం పెంచుకోవటమే.

  • విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు సున్నాకు చేరింది. ఇంధన వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం పడిపోయింది. ∙ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగైంది. ‘మాకు డాక్టర్లు, మందుల ఖర్చు పూర్తిగా లేకుండా పోయింది’ అని రేఖ ఆనందంగా చెబుతారు.

  • రసాయనాలు లేని నాణ్యమైన పండ్లు, కూరగాయల కోసం కొనుగోలుదారులే నేరుగా వీరి పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు, దళారుల కమీషన్ల భారం తప్పి అధిక నికరాదాయం లభిస్తోందని రేఖ వివరించారు.

  • ‘సేవా మందిర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సాంకేతిక సహకారం, మెరుగైన విత్తనాలతో పునాది వేసుకున్న భగవతీ లాల్‌–రేఖ దంపుతుల ప్రకృతి వ్యవసాయ మోడల్, పరిమిత వనరులు ఉన్న ప్రతి చిన్నకారు రైతుకూ లాభదాయకమైన దిక్సూచిగా నిలుస్తోంది.

భూమి విస్తీర్ణం చిన్నదైనా, ఆలోచన పెద్దదైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌ లోని రాజ్‌సమంద్‌ జిల్లా సేమా గ్రామానికి చెందిన భగవతీ లాల్, రేఖ అనే రైతు దంపతులు. పావు ఎకరం (అర బిఘా) భూమి ఉంటే ‘దీనితో ఏం చెయ్యలం?’ అని చాలామంది రైతులు నిరాశపడతారు. కానీ ఈ దంపతులు అదే పావు ఎకరం పొలాన్ని పచ్చని ప్రకృతి నందనవనంగా, లాభసాటి వ్యవసాయ వ్యాపార నమూనాగా మార్చి గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచారు.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)