Breaking News

అమ్మ వంట అంటే అంత ఇష్టం..!: సచిన్‌ టెండూల్కర్‌

Published on Mon, 10/26/2026 - 09:30

అమ్మ వంట అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎంత ఖరీదైన భోజనమైనా అమ్మ వంట ముందు బలాదూర్‌. ఆ విషయంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఔనంటూ అమ్మ వంటకే నూటికి నూరు మార్కులు వేసేస్తున్నాడు. అంతేగాదు తను క్రికెట్‌ పర్యటనల కారణంగా అమ్మ వంట ఎంతలా మిస్‌ అయ్యేవాడో..ఎలా మళ్లీ ఆ కమ్మని భోజనాన్ని ఆస్వాదించేవాడో సొషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు ఇలా. తనకు అమ్మ వంట అంటే ఎంత ఇష్టమో చెబుతూ..తను కుటుంబానికి దూరంగా గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ..తను ఇంటికి వచ్చే ముందు ఏం వంటకాలు కావాలో అమ్మకు ఫోన్‌లోనే వివరించేవాడినని అన్నారు. 

అంతేగాదు సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలపై ఉన్న ప్రేమను అభిమానులకు తెలియజేస్తూ..తన క్రికెట్‌ పర్యటనల కారణం అమ్మ భోజనాన్ని బాగా మిస్‌ అయ్యేవాడినని అన్నారు. తనకు నచ్చిన వంటకాలు సిద్దంగా ఉండేలా కనీసం రెండు లేదా మూడు రోజులు ముందుగానే ఇంటికి ఫోన్‌ చేసి ఏమి తినాలనుకుంటున్నానో అమ్మకి చెప్పేవారట. తను ఎక్కువుగా పప్పు, బియ్యం, సాంప్రదాయ మహారాష్ట్ర వంటకం అయిన వరణ్‌ భాత్‌, బంగాళదుంపలతో చేసే బటాటా భాజీ తదితరాలంటే ఇష్టమట. 

అలాగే తన  తల్లి ప్రత్యేకంగా చేసే ఒక మిశ్రమాన్ని గుర్తు చేసుకుంటూ..తరతరాలుగా కుటుంబంలో ఆచారంగా చేసే రెసిపీనే అయినా..ఆమె చేతితో చేసిన ఆ రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. నెయ్యి వేసి చేతులతో తినడం వల్ల ఆ భోజనం మరింత ప్రత్యేకంగా ఉండేదంటూ తన సంభాషణను ముగించారు. ఎంతటి ఘనుడైనా..ఓ అమ్మకి కొడుకే అన్నది జగమెరిగిన సత్యం అని మరోసారి నిరూపితమైంది కదూ.

 

ఇదీ చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి వ్యాపార అధ్యక్షురాలి రేంజ్‌కు..! ఆమె సక్సెస్‌ మంత్ర ఇదే..
 

Videos

Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

విర్రవీగుతున్న ఒక్కొక్కడిని చెప్తున్నా.. 2029 అధికారంలోకి వస్తే.. మీ ఊహకే వదిలేస్తున్న..

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

Photos

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)