Breaking News

Rutuja Warhade: దేశం కోసమే మొదటి అడుగు

Published on Sat, 04/19/2025 - 04:35

ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్ అకాడెమీ ఫలితాలు ఇటీవలే వెలువడ్డాయి. దేశం మొత్తం నుంచి 12 లక్షల మంది రాశారు. వీళ్లలో లక్షన్నర మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది పూణెకు చెందిన రుతుజా వర్హాడే. అంతే కాదు.. దేశం మొత్తం మీద 3వ ర్యాంక్‌ పొందింది. 75 ఎన్ డీఏ చరిత్రలో ఒక అమ్మాయి టాప్‌ ర్యాంక్‌ సాధించడం ఇదే మొదలు. ‘మొదటి నుంచి డిఫెన్స్ లో పని చేయాలనేది నా కోరిక... అందుకే కష్టపడ్డా’’ అంటోంది రుతుజా.

పూణెలో ఉండే ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌.డి.ఏ) ఎంట్రన్స్‌ సంవత్సరంలో రెండుసార్లు జరుగుతుంది. ఏప్రిల్‌లో. సెప్టెంబర్‌లో. ఏప్రిల్‌లో జరిగిన ఎంట్రెన్స్‌కు 12 లక్షల మంది దేశవ్యాప్తంగా అప్పియర్‌ అయితే వారిలో 3వ ర్యాంక్‌ సాధించింది రుతుజ వర్హాడే. అకాడెమీ చరిత్రలో ఒక అమ్మాయికి ఈ స్థాయి ర్యాంక్‌ రావడం ఇదే మొదలు. పరీక్షలో పాల్గొన్న 12 లక్షల మంది అభ్యర్థుల్లో లక్షన్నర మంది అమ్మాయిలైతే వారిలో మొదటి స్థానంలో నిలిచింది రుతుజ.  అందుకే ఆమెను అందరూ శ్లాఘిస్తున్నారు. ఆ ప్రతిభకు సెల్యూట్‌ చేస్తున్నారు.

దేశం కోసం...
రుతుజ పూణెలో పుట్టి పెరిగింది. తండ్రి ప్రొఫెసర్‌. తల్లి ఇంట్లో 5వ తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్‌ పిల్లల వరకూ మేథ్స్‌లో ట్యూషన్‌ చెబుతుంది. రుతుజ చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రిలియంట్‌గా ఉంది. పదవ తరగతిలో టాప్‌ మార్క్స్‌ వచ్చాయి. ఇంటర్‌లో కూడా అంతే. ఎన్‌.డి.ఏ ఎంట్రన్స్‌ ఇంటర్‌ తర్వాత రాయాలి కాబట్టి ముందు నుంచి ప్రిపేర్‌ అవుతూ కోచింగ్‌ తీసుకుంటూ రాసి టాప్‌ ర్యాంక్‌ సాధించింది. ‘ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌లో పని చేయాలనేది నా కల. దేశం కోసమే నా మొదటి అడుగు’ అంటోంది రుతుజ.

ఎనిమిదవ తరగతిలో ఉండగా...
సాధారణంగా ఆమ్మాయిలు ఎన్‌.డి.ఏ.లో చదవాలని  కోరుకోరు. అందుకే నిన్న మొన్నటి వరకూ వారిని  అనర్హులుగా చూసేది ఎన్‌.డి.ఏ. అయితే రుతుజ ఎనిమిదవ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎన్‌.డి.ఏ. ఇకపై ఆడపిల్లలకూ ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ‘ఈ విషయం మా క్లాస్‌లో చర్చకి వచ్చింది. అప్పుడే ఎన్‌.డి.ఏ గురించి తెలిసింది. 

మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటం మొదటి అర్హత అయితే కఠినమైన రిటన్‌ టెస్ట్‌లో పాసయ్యి రెండవ దశలో సీట్‌ సంపాదించడం ఇంకా కష్టమని తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ అకాడెమీలో చేరాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. మేథ్స్, అబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌ మీద ప్రశ్నలు ఉంటాయి. వాటి కోసం కోచింగ్‌ సెంటర్‌లో నాలుగైదు గంటల మెగా లెక్చర్స్‌ వినేదాన్ని. అంతేకాదు... మా నాన్నగారు అందించిన ప్రోత్సాహం కూడా నన్ను మోటివేట్‌ చేసింది’ అంటుంది రుతుజ.

మాటలు పడినా...
రుతుజ ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. చదువులోనే నిమగ్నమై ఉండటంతో స్నేహితులు ఆమెను బాయ్‌కాట్‌ చేశారు. ఎప్పుడూ చదువే నీకు... ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో నీ ప్రతిభ గుండు సున్నా అని ఎగతాళి చేశారు. ‘రోషపడి సీనియర్‌ ఇంటర్‌లో క్లాసుల కంటే కూడా స్పోర్ట్స్‌ అండ్‌ ఆర్ట్స్‌లో ఎక్కువ సమయం వెచ్చించాను. దాంతో నా గ్రేడ్స్‌ పడిపోయాయి. చాలా డల్‌ అయిపోయాను. ఆ దశ నుంచి తిరిగి టాప్‌ స్టూడెంట్‌గా నిలవడానికి కష్టపడాల్సి వచ్చింది’ అని తెలిపింది రుతుజ.

‘సాధారణంగా సీనియర్‌ ఇంటర్‌లో చాలామంది డైవర్ట్‌ అవుతారు. అలా కాకుండా కష్టపడి చదివి లక్ష్యం వైపు అడుగు వేస్తే విజయం మీదే’ అంటోంది రుతుజ.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)