రష్యన్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ బైకర్‌ మృతి..మరో రైడింగ్‌ గ్రూప్‌..!

Published on Thu, 07/25/2024 - 14:01

రష్యన్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ బైకర్‌ టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన మోటార్‌ బైక్‌ ప్రమాదంలో మరణించింది. 38 ఏళ్ల ఈ రష్యన్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ తన ఎరుపు రంగు బీఎండబ్ల్యూ మోటార్‌ సైకిల్‌ని రైడ్‌ చేస్తూ..ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మరణించింది. టాట్యానా తోపాటు వచ్చిన టర్కిష్‌ బైకర్‌, ఒనూర్‌ ఒబుట్‌ ప్రాణాలతో బయటపడ్డారు కానీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలోనే ఉన్నారు. 

సంఘటనా స్థలంలో ఉన్న మూడో బైకర్‌కి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాట్యానా తనమోటార్‌ బైక్‌ నడుపుతుండగా సడెన్‌గా మరో రైడింగ్‌ గ్రూప్‌ అడ్డురావడంతో ఒక్కసారిగా బ్రేక్‌ వేసింది. దీంతో టాట్యానా తన బైక్‌పై నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న ట్రక్‌ని ఢీ కొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఈ ఘెర ప్రమాదం సంభవించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉంగా, సోషల్‌ మీడియాలో మోటో టాన్యాగా పేరుగాంచిని టాట్యానాకు ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రాంలో 10 లక్షల మంది, యూట్యూబ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. టాట్యానా ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన బైక్‌ రైడింగ్‌లు చేస్తుంటుంది. తన చివరి ఇన్‌స్టాగ్రాం పోస్ట్‌లో రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా యూరప్‌ ప్రవేశానికి అనుమతి లేదని రాసుకొచ్చింది. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మోటార్ సైకిళ్లపై ఉన్న అభిరుచి ఆమెను నిరతరం వార్తల్లో నిలిచేలా చేసింది. ఆమెకు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. టాట్యానా మృతితో ఒక్కసారిగా ఆమె కుటుంబంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

 

(చదవండి: 'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్‌ గురించి విన్నారా?)
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)