Breaking News

జయాబచ్చన్‌ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి

Published on Fri, 08/15/2025 - 17:12

జయా బచ్చన్‌ సెల్పీ వివాదం, ఘాటుగా స్పందించిన  మరో నటి  రాజ్యసభ ఎంపీ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్‌  సెల్ఫీ వివాదంపై మరోనటి బీజేపీనేత రూపాలీగంగూలీ స్పందించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని నెట్టివేసిన ఘటనపై  రూపాలీ అలియాస్ అనుపమ కూడా  విమర్శించారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ మరోసారి తన సహనాన్ని కోల్పోయిన వీడియోపై రూపాలి గంగూలీ స్పందిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో జయ బచ్చన్ నుండి నటన నేర్చుకున్నప్పటికీ, ఇపుడు మాత్రం ఆమె నుంచి బిహేవియర్‌  లక్షణాలను ఎప్పటికీ నేర్చుకోకూడదని  భావిస్తున్నా అన్నారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన  బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ జయా బచ్చన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

చదవండి: అమితాబ్‌ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్‌

కాగా అయితే పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్‌ సహనం కోల్పోయిన గతంలో  కూడా వివాదాన్ని  రేపాయి.అలాగే ఇటీవల ఆపరేషన్‌ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా కూడా జయాబచ్చన్‌ సహనం కోల్పోయారు. గత ఏడాది జూలై-ఆగస్టులో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ఆమెను సభకు పరిచయం  చేస్తూ ఆమెను జయా అమితాబ్‌ బచ్చన్‌ అని సంబోధించడాన్ని తీవ్రంగా తప్పపట్టారు.అమితాబ్‌ పేరుతో కలిపి తనను పరిచయం చేయడం నచ్చలేదని అన్నారు.కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమాంలో వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి ఆమె వద్ద  వచ్చినపుడు అతనిపై కోప్పడటమేకాదు, అతణ్ణి తోసి వేయడంతో జయా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.  

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు