Breaking News

గుర్తుందా..!? వానల కోసం పిల్లుల ఊరేగింపు.. ఈసారీ వింతగా..

Published on Sun, 06/16/2024 - 12:18

వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్‌లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.

వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్‌ మ్యావ్‌’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.

ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్‌ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్‌’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.

ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)