నటి భర్త, టైగర్‌ మ్యాన్‌ వాల్మీక్‌ థాపర్‌ ఇకలేరు.. ఎవరీ థాపర్‌?

Published on Sat, 05/31/2025 - 12:23

ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత  వాల్మీక్‌ థాపర్ (Valmik Thapar)  ఇకలేరు.  టైగర్‌ మ్యాన్‌గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు.  ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్‌ మరణంపై పలువురు సంతాపం  వ్యక్తం చేశారు.

సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్‌తో కలిసి పనిచేశారు. 

వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్‌మెడల్‌ సాధించారు.  లివింగ్ విత్ టైగర్స్,  ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (1997)  టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. 

ఇంకా  ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై  రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997)  బాగా పాపులర్‌.  2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా.  భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని  ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్‌ థాపర్‌

ఎవరీ వాల్మీక్‌ థాపర్‌
వాల్మీక్‌ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్‌ను వివాహం చేసుకున్నారు. 

గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు.  ప్రస్తుతం రణతంబోర్ థాపర్‌ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్‌ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా  పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.

ఫియర్‌లెస్‌ టైగర్‌ ఛాంపియన్  అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్‌ థాపర్‌ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం  నిలిచిపోతారన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)