Breaking News

మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? క్యాన్సర్‌ వస్తుంది

Published on Wed, 09/27/2023 - 14:48

ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్‌ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం. 

చాలామంది నాన్‌ వెజ్‌ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్‌ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్‌ పాయిజన్‌ జరుగుతుందని తేలింది.


► గుడ్లని ఆమ్లెట్‌ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

► మైక్రోవేవ్ ఓవెన్‌లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి.

► చికెన్‌ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి.

► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్‌ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు.

► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది.

► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్‌ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్‌ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)