Breaking News

ఎండుద్రాక్ష రికార్డు అమ్మకాలు: ఒకేరోజు 17 టన్నులు

Published on Mon, 03/17/2025 - 15:26

 సోలాపూర్‌: పండరీపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో శనివారం రికార్డుస్థాయిలో 17 టన్నుల ఎండుద్రాక్ష విక్రయం జరిగింది. పండరీపురం తాలూకా నాణ్యమైన ఎండుద్రాక్ష ఉత్పత్తికి ప్రస్ధిద్ధి. అందుకే ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి ఎండు ద్రాక్షను కొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఈ నేపథ్యంలో పండరీపురం మార్కెట్‌లోని స్వప్నిల్‌ కొటాడియా దుకాణంలో పండరీపురం తాలూకా, భారడీ గ్రామానికి చెందిన రైతు ఆకాష్‌ వసెకర్‌కు చెందిన ఎండుద్రాక్ష పంటను కిలోకు రూ. 511 చొప్పున 17 టన్నుల మేర కొనుగోలు చేశారు. సాధారణంగా కిలోకు 200–500 మాత్రమే పలికే ఎండుద్రాక్షను అధిక ధరకు, పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రైతు ఆకాష్‌ వసెకర్‌ను యూటోపియన్‌ కార్ఖానా చైర్మన్‌ ఉమేష్‌ పరిచారక్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరీష్‌ గైక్వాడ్‌ సన్మానించారు.  

ఎండు ద్రాక్షతోఉపయోగాలు : ఎండుద్రాక్షల  వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్,  గ్లూకోజ్ పుష్కలంగా ఉంటాయి కనుక  తక్షణ శక్తిని అందిస్తాయి. ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలుపుష్కలంగా లభిస్తాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

  • ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , మలబద్ధకాన్ని నివారిస్తుంది.

  • ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

  • చర్మంపై మొటిమలు, ముడతలు, వృద్ధాప్యం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇనుము రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.  

  • వీటిని  నీటిలో నానబెట్టి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.

  • ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నిద్రలేమికి ఉపశమనం కలిగిస్తుంది

  • ఎండుద్రాక్షలో ఇనుము ఉంటుంది, ఇదిచేయడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?
మీరు ఎండుద్రాక్షను నేరుగా తినవచ్చు, ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తాగవచ్చు, ఎండుద్రాక్షను పాలలో కలిపి తాగవచ్చు, ఎండుద్రాక్షను వివిధ వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు.

చదవండి: వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలా? అడ్డంగా బుక్కైన ‘ఓర్రీ’
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్‌ కమెంట్లు వైరల్‌
గమనిక: ఎండుద్రాక్షను మితంగా మాత్రమే తినాలి.  గర్భవతి అయితే, లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఎండుద్రాక్షను తినే ముందు మీ డాక్టర్ని సంప్రదించాలని చెబుతారు.

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)