Breaking News

గర్ల్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌ సార్‌... లీవ్‌ ప్లీజ్‌! వైరల్‌ మెయిల్‌

Published on Wed, 10/29/2025 - 17:08

సాధారణంగాఉద్యోగులకు బాస్‌ను లీవ్‌ అడగాలంటే భయం. నిజాయితీగా ఉన్నకారణం చెబితే లీవ్‌ ఇస్తారా? లేదా అనేదాంతో  ఏవో వంకలు చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో,  ఇంట్లో వాళ్లకి  బాలేదనో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. అంతేకాదండోయ్‌.. అల్‌ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్‌ పెట్టే  ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా ఒక లీవ్‌ మెయిల్‌ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.  

ఇటీవలి కాలంలో కార్పొరేట్‌ కంపెనీల సీఈవో కొన్ని విచిత్రాలను, విశేషాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా  గుర్గావ్‌కు చెందిన CEO  ఉద్యోగి సెలవు అడిగిన తీరును షేర్‌ చేశారు. అతని నిజాయితీని మెచ్చుకున్నాడు. జెన్‌ జెడ్‌ (Gen Z) వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని నావిగేట్ చేసే విధానం తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది.  ఇంతకీ ఏం జరిగిందంటే..

గురుగ్రామ్‌లోని నాట్ డేటింగ్  కో ఫైండర్‌, సీఈవో  జస్వీర్ సింగ్‌  తన కంపెనీ ఉద్యోగి లీవ్‌ కు సంబంధించిన ఒక మెయిల్‌ సెలవు  స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు.  అందులో  ఇటీవల బ్రేకప్‌ అయింది సార్‌, లీవ్‌ కావాలి..  పనిమీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను.  కొంత సమయం కావాలి. 28వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (దాదాపు 11 రోజులు) సెలవు తీసుకోవాలని అనుకుంటున్నాను." అంటూ  లీవ్‌ కోసం దరఖాస్తు చేశాడు. అతనికి లీవ్‌ మంజూర్‌ చేశారట. సింగ్ దీనిని తాను అందుకున్న "అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు"గా అభివర్ణించడం తోపాటు, జెన్‌ జెడ్‌ (Gen Z)  ఏదీ దాచుకోదు అంటూ  కమెంట్‌  చేయడం విశేషం.

ఉద్యోగి నిజాయితీని, దానికి మద్దతుగా నిలిచిన సీఈఓ నిర్ణయాన్ని ప్రశంసించారు నెటిజన్లు. మీరు మంచిబాస్‌ ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు Gen-Z ను మిలీనియల్స్‌తో పోల్చి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. "జనరల్ జెడ్ బ్రేకప్‌ అయితే లీవ్‌ పెడతారు..కానీ మిలీనియల్స్ అలా కాదు వాష్‌రూమ్‌లో ఏడ్చుకుంటారు.. టార్గెట్లను ఫినీష్‌ చేస్తారు భావోద్వేగంతో  స్పందించారు.

చదవండి: పాపం.. పిల్లి అనుకుని పాంపర్‌ చేశాడు, అసలు సంగతి ఇదీ!

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)