Breaking News

Rani Mukerji: టోన్డ్‌ బాడీ సీక్రెట్‌..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!

Published on Fri, 03/21/2025 - 13:00

బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్‌గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్‌తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్‌గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్‌ బాడీతో మెస్మరైజ్‌ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్‌ ప్లాన్‌, వర్కౌట్‌లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..

ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్‌ ఫిగర్‌ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్‌-వర్కౌట్‌ ప్లాన్‌ని అనుసరించిందంటే. 

రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...

  • తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.

  • ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్‌

  • రెండు గంటలు వ్యాయామం

  • అల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ 

  • మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.

  • సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .

  • రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.

  • 100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవు

చివరగా టైనర్‌ సత్యజిత్‌ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి  విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది.  ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన​్‌గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్‌ ప్లాన్‌ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. 

నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్‌ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్‌ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు.  

(చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!)
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)