Breaking News

ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్‌ ఫోనులే!

Published on Wed, 12/24/2025 - 16:12

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్‌లేని ప్రపంచాన్నే ఊహించలేం. అదీగాక చేతిలో ఫోన్‌ లేకపోతే ఏ పని సాగదు, కాలు కూడా కదపలేం. అంతలా టెక్నాలజీపై ఆధారపడిపోయాం లేదా బానిసలమైపోయాం అనొచ్చేమో..!. ఏ చిన్న సందేహమైనా..ఏదైనా.. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా.. చేతిలో ఫోన్‌ ఉంటే చిటికెలో పనైపోతుంది. అంతలా మనకు అన్నింటిని అరచేతిలోకి వచ్చేసేలా అమర్చి పెట్టేసింది. అలాంటి స్మార్ట్‌ పోన్‌ని స్వచ్ఛంధంగా వాడకూడదని నిషేధం విధించుకుంది ఓ గ్రామం. అలా ఎందుకు చేసిందో తెలిస్తే..కచ్చితంగా సెల్యూట్‌ చేస్తారంతా. అయితే ఇది మరోకంగా విమర్శలకు దారితీసింది. ఆ నిషేధం కూడా సమంజసంగా ఉంటే..ఇతర గ్రామాలకు ఆదర్శంగానూ, అభినందనీయంగానూ ఉండేది. ఇంతకీ ఎందుకోసం స్మార్ట్‌ ఫోన్‌ని సీరియస్‌గా బ్యాన్‌ చేశారంటే..

రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలోని 15 గ్రామాలు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయట. యావత్తు ప్రపంచం 6జీ వైపు దూసుకుపోతే అక్కడ మాత్రం మహిళలను కీప్యాడ్‌ పోన్‌ల యుగానికి వెళ్లిపోదాం అంటోంది. చౌదరి కమ్యూనిటీకి చెందిన సుంధమాతా పట్టి పంచాయితీ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా అక్కడ మహిళలు, బాలికలు వినయోగించకూడదు. 

అత్యవసరం అనకుంటే కీప్యాడ్‌ ఫోన్‌లే ఉపయాగించాలి అక్కడి మహిళలు. ఇదంతా ఎందుకంటే..మైబైల్‌ ఫోన్‌ ఒక వ్యసనంగా మారి పక్కదారి పట్టిస్తోందని, ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందనే ఆయా గ్రామాలు స్మార్ట్‌ ఫోన్‌ని ఉపయోగించకూడదని నిషేధం విధించాయట. అంతేగాదు చదువుకునే పిల్లలు సైతం తమ ఇంట్లో ఫోన్‌ ఉపయోగించుకోవచ్చు గానీ బయటకు తీసుకురావడానికి వీల్లేదట. 

మహిళలే ఎందుకంటే..
కచ్చితం అమ్మతోపాటు పిల్లలు ఉంటారు. దాంతో తరుచుగా చిన్నారులు వాటిని వినియోగించే అవకాశం ఉన్నందున మహిళలు కీప్యాడ్‌ ఫోన్‌లే ఉపయోగించాలని నిర్ణయించిందట పంచాయతీ. కాగా, ఆదివారం ఘాజీపూర్ గ్రామంలో జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. 14 పట్టి సమాజం అధ్యక్షుడైన సుజనారామ్ చౌదరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. 

అక్కడి పంచాయతీ ప్రకారం..దేవరామ్ కర్నోల్ వర్గం ముందుకు తెచ్చిన ప్రతిపాదనను పంచ్ హిమ్మతారామ్ చదివి వినిపించారు. చర్చల అనంతరం, సమావేశానికి హాజరైన పంచ్ సభ్యులందరూ ఈ నిబంధనను అమలు చేసేందుకు మొగ్గుచూపారు. ఈ తీర్మానం జనవరి 26 నుంచి అమలవుతుందట.

ఏయే గ్రామాల్లో ఇది అమలు అంటే..
ఈ నిర్ణయం భిన్‌మల్ ప్రాంతంలోని పలు గ్రామాలలో అమలు చేయబడుతుంది. వీటిలో ఘాజీపూర్, పావలి, కల్డా, మనోజియావాస్, రాజికావాస్, దట్లావాస్, రాజ్‌పురా, కోడి, సిద్రోడి, ఆల్డి, రోప్సి, ఖానాదేవల్, సావిధర్, హత్మీ కి ధాని, ఖాన్‌పూర్ గ్రామాలు ఉన్నాయి. 

నిజానికి పంచాయితీ చర్య సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల సంస్థల నుంచి తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం మహిళా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఏ నిషేధం అయినా లింగ సమాన‍త్వానికి పెద్ద పీటవేసేలా ఉండాలి గానీ, మహిళలే లక్ష్యంగా నిషేధం అంటే సహించదగినది కాదంటున్నారు సామాజికకార్యకర్తలు, మహిళా సంఘాలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడమే కాదు హాట్‌టాపిక్‌గా మారింది కూడా. 

(చదవండి: Sobhita Dhulipala: ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! నాటి రాణుల వైభవాన్ని తలపించిలా..)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)