Breaking News

ఆ గేదె, గుర్రం ధర వింటే..నోట మాటరాదు..!

Published on Tue, 10/28/2025 - 14:27

మంచి మేలు జాతి రకం గేదె, గుర్రం ధర మహా అయితే లక్షల విలువ పలుకుతాయ్‌ అంతే. ఎంతలా చూసినా..అంతకుమించి పలికే ఛాన్స్‌ లేదు. కానీ ఇక్కడ పశువుల సంతలో గుర్రం, గేదెల ధర వింటే..నోటమట రాదు. వింటుంది నిజమేనా అనే సందేహం కలుగక మానదు. మరి ఇంతకీ అదెక్కడ తెలుసుకుందామా..!.

రాజస్థాన్‌లో జరిగే వార్షిక పుష్కర్‌ పశువుల సంతలో ఈ వింతను చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పశువులు కనిపిస్తాయి. దీన్ని తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తుంటారట. ఈ ఏడాది ఒక గుర్రం, గేదె ఖరీదు ప్రకారం..చాలా హైలెట్‌గా నచ్చాయి. 

ఈ ఉత్సవంలో షాబాజ్‌ అనే గుర్రం ఏకంగా రూ. 15 కోట్లు ధర పలికింది. రెండున్నర ఏళ్ల ఈ గుర్రం ఇప్పటికే పలు ప్రదర్శనల్లో గెలుపొందిందట. ప్రతిష్టాత్మక మార్వారీ జాతికి చెందన ఈ గుర్రాన్ని కొనుగోలు చేస్తామంటూ.. రూ. 9కోట్లు నుంచి రూ. 15 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయని చెబుతున్నాడు సదరు యజమాని. అంతేకాదండోయ్‌ ఈ గర్రం పెంపకానికే దగ్గర దగ్గర రూ. 2 లక్షలు దాక ఖర్చు అవుతుందట. 

 

ఆ తర్వాత అందరీ దృష్టిని ఆకర్షించిన మరో జంతువు అన్మోల్‌ అనే గేదె. దీని ధర సుమారు రూ. 23 కోట్లు పైనే పలుకుతుందని సదరు యజమాని చెబుతున్నారు. ఇది రాజకుటుంబానికి చెందినదట. దీనికి ప్రతిరోజు పాలు, దేశీ నెయ్యి, డ్రైఫ్రూట్స్‌ వంటి ప్రత్యేక ఆహారం పెడతాడట యజమాని. ఇక పశువుల ఫుష్కర ఫెయిర్‌లో వీటితోపాటు రాణ అనే గేదె రూ. 25 లక్షలు పలకగా బాదల్‌ అనే మరో ఛాంపియన్‌ హార్స్‌ రూ. 11 కోట్లు వరకు పలుకుతుండటం విశేషం. కాగా, ఈ పుష్కర్‌ ఫెయిర్‌ అనేది రాజస్తాన్‌ పశుసంవర్ధకానికి సంబంధించిన సంప్రదాయ వేడుక. 

 

ఈ కార్యక్రమంలో ఉత్తమ జాతి పశువులను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేస్తారు. అలాగే ఈ వేడుకలో ఉత్తమ ఏ2 పాలను ఉత్పత్తి చసే గిర్‌ ఆవులకు ప్రత్యేక స్థానం ఇస్తారట. ఇక ఈ రాజస్థాన్‌లో నాగౌర్‌ ఎద్దుల పోటీ ఈ వేడుక కంటే ప్రధాన ఆకర్షణగా ఉండటమే గాక సందర్శకుల తాకిడి కూడా అత్యధికమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ వేడుక అక్టోబర్‌ 23 నుంచి మొదలై, నవంబర్‌ ఏడు వరుకు జరుగుతుందట. అయితే ఈ ఏడాది వేడుకలో ఇప్పటివరకు సుమారు మూడు వేల పైనే ఉత్తమ పశువులుగా ఎంపికవ్వడం విశేషం. 

(చదవండి: రిటర్న్‌ గిఫ్ట్‌.. రిఫ్లెక్షన్‌ ఆఫ్‌ జాయ్‌..)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)