Breaking News

అత్తారింటికి విమానంలో..! అరుదైన వివాహ వేడుక

Published on Tue, 10/20/2026 - 13:44

ఆడంబరమైన పెళ్లి కాదు, కానీ ఆ సోదరులు చేసిన ఘనమైన వివాహ ఏర్పాటు ఆ గ్రామానికే కన్నుల పండుగగా మారింది. చూడటానికి ఆ సోదరులు స్థాయికి పెద్ద మొత్తం ఖర్చు అయినా..ఆ వధువుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతిని అందించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రైతు కుమారులైన రోహిల్‌ ఖాన్‌, సాహిర్‌ ఖాన్‌లకు సమీప గ్రామానికి చెందిన ఇద్దరి అక్కాచెల్లెళ్లతో వివాహం జరిగింది. విమానంలో తమ అత్తారింటికి వెళ్లాలన్న ఆ వధువుల కోరికను నెరవేర్చేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే ఏర్పాటు చేశారు. దాంతో ఈ పెళ్లి వేడుక ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. 

ముఖ్యంగా ఆ హెలికాప్టర్‌ని చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అంతేగాదు అక్కడ స్థానికులు ఈ వివాహాన్ని తమ గ్రామానికే గర్వకారణమైన క్షణంగా సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. కాగా, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న పినాన్ రెస్ట్ హౌస్ నుంచి ఈ హెలికాప్టర్‌ని అద్దెకు తీసుకున్నట్లు ఆ వధువుల తండ్రి తెలిపాడు. 

జస్ల్‌ నాలుగు గంటల బుకింగ్‌కి ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చు అయ్యిందట. హెలికాప్టర్ ఒక గ్రామంలో రెండు గంటలు, మరో గ్రామంలో మరో రెండు గంటలు గడిపి, పెళ్లిలోని ఇరు పక్షాలకు సేవలు అందించిందట. అయితే పెళ్లికొడుకులు మాత్రం సింపుల్‌గా తమ కాబేయే భార్యల కల కోసమే ఇలా  చేశామని చెబుతుండటం విశేషం. 

ఇదీ చదవండి: ఇంద్రధనస్సు, పచ్చదనం మెరుపుల్‌..! నీతా అంబానీ, రాధికా మర్చంట్‌ల ట్రెడిషనల్‌ లుక్‌!
 

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)