Breaking News

బడ్జెట్‌ ఫ్రెండ్లీ టూర్‌కి వెళ్లాలా? పచ్చని కొండలు.. అదిరిపోయే రిసార్ట్స్‌

Published on Wed, 05/28/2025 - 11:28

సాక్షి, హైదరాబాద్: దైనందిన జీవితంలోని వేగం, ఒత్తిడి, కాలుష్యం వగైరాలకు దూరంగా వెళ్లి ఓ నాలుగు రోజులు సేదితీరి రావాలని ఎవరికి ఉండదు? కానీ ఆ డెస్టినేషనన్ను ఎలా ఎంచుకోవడం? మానసిక ప్రశాంతతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ముఖ్యమే కదా!

ఆ రెండింటికీ గమ్యం పూంబారై! 
హిమాలయాల సరిహద్దుల్లోని హిల్స్ స్టేషన్లలో యుద్ధభయం ఇంకా వీడకపోగా, దక్షిణాన ఉన్న నీలగిరితో పాటు ఇతర అన్ని హిల్ స్టేషన్స్ జనాలతో కిటకిటలాడుతూ పట్టణ, నగర వాతావర ణాన్ని తలపిస్తున్నాయి. అందుకే సిమ్లా, కులూ, మనాలి నుంచి ఊటీ, కొడైకెనాల్ వరకు దేన్ని చూసినా అమ్మో.. వాటికన్నా ఇల్లే నయమనిపించేలా చేస్తున్నాయి. కానీ పూంబారై అలా కాదు. కొడైకెనాలికి 25 కిలోమీటర్ల పైన పచ్చటి కొండల ఒడిలో.. జలజల పారే జలపాతాల మధ్య.. మూడు కాలాలకూ సూటయ్యే ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరి ఉందీ ఊరు! మిగిలిన హిల్ స్టేషన్లలో ఉన్నట్లు కిక్కిరిసిన హోటళ్లు.. జన సందోహంతో నిండిన రిసార్ట్స్ లేవు. ప్రకృతి వీక్షణ, ఆస్వాదనకు వీలుగా కొండవాళ్లలో ప్రైవసీ ప్రాధాన్యంగా డోమ్స్ నిర్మాణాలుంటాయి. ఇంత దూరం వచ్చి మళ్లీ సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్ మునిగిపోకుండా ఉండటానికి డిజిటల్ డిటాక్సిఫికేషన్ను దృ ష్టిలో పెట్టుకుని వైఫై కనెక్టివిటీ ఇవ్వలేదు ఈ డోమ్స్‌కు 

శారీరక, మానసిక రిలాక్సేషన్ కోసం
జకూజీ, స్విమ్మింగ్ పూల్, ఆవిరి స్నానాల పెట్టె, ఆరుబయట షవర్ వంటి సౌకర్యాలన్నింటితో క్యాంపింగ్ తరహా బసలివి. అదే లక్స్ గ్లాంప్ ఎకో రిసార్ట్స్! దీంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పర్యాటకులు పూంబారై బాట పడుతున్నారు. ఈ రిసార్ట్స్ నిర్మాణానికి పూర్వం పూంబారైలో సరైన రోడ్డు, రవాణా సదుపాయాలు అంతగా ఉండేవి కావు. వీటి నిర్మాణంతో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవ లప్ అయింది. అంతేకాదు స్థానిక యువత, మహిళలకు ఈ రిసార్ట్స్ ఉపాధినీ కల్పిస్తున్నాయి. స్థానికం గా పండే పంటలు, కూరగాయలను ఇక్కడి రెస్టా రెంట్స్ కొనుగోలు చేస్తున్నాయి. మూడుకాలాలు పూర్తి ఆక్యుపెన్సీతో ఉండే ఈ రిసార్ట్స్ వల్ల స్థానిక యువత నుంచి రైతుల వరకు అందరికీ ఏదోరకం గా ఉపాధి అందుతోంది. అంతేకాదు దీనివల్ల రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో స్థానికుల చదువు, వ్యాపార వాణిజ్యాలూ ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయి. దీంతో పూంబారై ఆర్థిక చిత్రం మారిపోయింది.

లగ్జరీ, క్యాంపింగ్ కలిసేలా.. 
లక్స్‌ క్యాంప్‌ ఈ డోమ్ తరహా రిసార్ట్స్‌ను ఇదే లక్స్ గ్లాంప్ సంస్థ మున్నార్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మంచి ఫలితాలను ఇవ్వడంతో పూంబారైలోనూ నిర్మించింది. ఆ సంస్థ యజమాని కేరళ త్రిస్సూర్‌కు చెందిన ఆంటోనీ థామస్. బిజినెస్ డెవలపర్. వృత్తి రీత్యా దుబాయ్ లో ఉంటున్నారు. ఈ రోజుల్లో కాలుష్యం లేని ప్రకృతిలో గడిపే అవకాశం రావడం నిజంగానే లగ్జరీనే. అలాంటి లగ్జరీ.. క్యాంపిం డూ కలిసేలా ఈ రిసార్ట్స్‌కు లక్స్ గ్లాంప్ అని పేరు పెట్టామని చెబుతారాయన. 

అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే.. 'నాకు చిన్నప్పటి నుంచీ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి సంస్కృతీ సంప్ర దాయాలను తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. నాతో పాటే ఆ ఆసక్తీ పెరుగుతూ వచ్చింది. లక్కీగా మా ఆవిడ ఎలీనా థామస్కు పర్యటనలంటే ఇష్టం ఉండటంతో ఏ కాస్త టైమ్ దొరికినా ఇద్దరం ప్రపం చ దేశాలను సందర్శిస్తూంటాం. దీనివల్ల పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం దొరకడమే కాదు. మా బిజినెస్ డెవలప్మెంట్ కి కొత్త ఐడియాలూ వస్తుంటాయి. అలా ఒకసారి యూరప్ వెళ్లినప్పుడు అక్కడ చాలా చోట్ల గ్లాస్ క్యాబిన్ల నుంచి ఆలైప్ లాడ్జెస్, డోమ్స్, బబుల్ రిట్రీట్స్ చాలా కనిపిం చాయి. వాటిల్లో బస చేశాం. వండర్ఫుల్ ఎక్స్ప రియెన్స్ అలాంటిది మన దగ్గర కనిపించలేదు. 

క్యాంపింగ్‌కి కనీస వసతులు కూడా లేని గుడారాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కుటుంబంతో కలిసి క్యాంపింగ్ చేయాలంటే భద్రత, సౌకర్యాలు ప్రధా నమవుతాయి కదా! వీటన్నింటిని దృష్టిలో పెట్టు కుంటే మేము యూరప్లో ఎక్స్పీరియెన్స్ చేసిన గ్లాస్ క్యాబిన్, డోమ్స్ పర్ఫెక్ట్ అనిపించాయి. వాటిని దక్షిణ భారతంలో ప్రవేశపెట్టాలనుకుని ముందు పైలట్ ప్రాజెక్ట్ 2018లో మున్నార్ స్టార్ట్ చేశాం. పూంబారైలో మా లక్స్ గ్లాంప్ ఎకో రిసార్ట్స్ ప్రారంభంతో ప్రారంభంతోనే ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. ఇన్ఫ్రాన్ఫ్రాస్ట్రక్చర్ సహా చాలా వస తులు ఏర్పడి ఈ ఊరికి ఓ కొత్త కళ వచ్చింది. భవిష్యత్లో మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ తరహా కట్టడాలతో పర్యాటక ప్రియులకు సౌకర్యవంతమైన, పర్యావరణప్రియ బసను అం దించాలనుకుంటున్నాం' అని ఆంటోనీ థామస్ తెలి పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)