Breaking News

మర్డర్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!

Published on Fri, 03/29/2024 - 15:41

సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ  వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్‌గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన  మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

వివరాలిలా ఉన్నాయి:
బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు  ఈ నెల 24న  సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో  బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత  భావించారు. 

అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది.  రైలు విఠల్‌వాడి స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి   ప్రభాస్  భాంగే బయట  రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్‌ఫోన్‌ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్‌ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. 

అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్‌ ఫోన్‌ కొట్టేసేందుకు కూడా ఆకాశ్‌ జాదవ్‌ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్‌ను అదుపులోకి  తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని  రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)