Breaking News

బంగారంతో లెహంగా.. అంబానీ కోడలంటే మినిమమ్‌ ఉంటది!

Published on Thu, 03/07/2024 - 17:09

అనంత్‌ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్‌ బ్రాండ్‌ డ్రస్‌లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్‌ అగ్ర తారలు, ప్రముఖ పాప్‌ సింగర్‌లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు.

అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్‌ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ ధరించిన డ్రస్‌లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్‌ అంబానీ రేంజ్‌కి తగ్గట్టు ఆమె డ్రస్‌లు నగలు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. అది కామనే.

కానీ ఇలా ప్రీ వెడ్డింగ్‌ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్‌లో డ్రస్‌లు డిజైన్‌ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్‌పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్‌ర్‌ మనీష్‌ మల్హోత్రా రూపొందించారట.  అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్‌ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్‌ మీడియా పేర్కొంది. 

(చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్‌ చేసిన జాకెట్‌..ధర ఏకంగా..!)
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)