రాధిక మర్చంట్‌ లైలాక్‌ వాచ్‌..! ప్రపంచంలోనే..

Published on Tue, 03/31/2026 - 17:23

మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రాధికా మర్చంట్‌ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్‌ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్‌ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 

చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్‌ రిచర్డ్ మిల్లే వాచ్‌తో తన లుక్‌ను హైలెట్‌ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్‌. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. 

సముద్ర స్ఫటికపు పారదర్శకత,  గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్‌. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్‌. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది.  దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

ప్రత్యేకతలు..
వాచ్‌ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్‌తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్‌ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్‌ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. 

అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ​ సుమారు 65 గంటల వరకు ఫుల్‌ చార్జ్‌ ఉంటుందట. ఈ వాచ్‌ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు.

 

(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)

 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)