Breaking News

బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్‌చేస్తే..

Published on Mon, 03/23/2026 - 14:11

చాలామంది యువత కలలుగనే లగ్జరీ లై​ఫే ఈ వ్యక్తిది. ఎంతో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ హాయిగా సాగిపోతున్న జీవితానికి సడెన్‌గా స్వస్తి పలికి..ఏదో గొప్పజీవితం కోసం అన్వేషిస్తూ దేశాలు పర్యటించడం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో అతడి లైప్‌ ఏవిధంగా యూటర్న్‌ తీసుకుని ఫ్యామిలీ మ్యాన్‌గా మారాడో తెలిస్తే అవాక్కవుతారు. పైగా ఆ తర్వాత కూడా తన నిర్ణయంలో మార్పు లేకపోగా..ఇలా బతకాలి అనేపించేలా రాజులా బతుకుతుండటం విశేషం. 

ఆ వ్యక్తి తన కథను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  షేర్‌ చేయడంతో..అందర్నీ అమితంగా ఆకర్షించేలా ఆలోచింపచేసింది. వ్యక్తిగత విజయం కంటే సంతృప్తి మిన్నా అనే చర్చలకే తెరలేపింది. ఆ పోస్ట్‌ ప్రకారం  ఆవ్యక్తి ఐఐటీ చేసి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అతను విజయవంతమైన కార్పొరేట్‌ కెరీర్‌ని నిర్మించుకున్నాడు. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి, అతను ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో డైరెక్టర్‌గా ఉన్నత స్థాయికి ఎదిగి, చాలామంది కోరుకునే లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేశాడు. 

కానీ అవేమి తనకు సంతృప్తినివ్వక పోవడమే గాక వివిధ హోదాల వెంట తిరుగుతూ ఓ చట్రంలో ఇరుక్కుపోయిన ఫీలింగి కలిగింది అతడికి. దాంతో ఈ కార్పొరేట్‌ లైఫ్‌ నా వల్ల కాదు అని డిసైడ్‌ అయ్యి..2013లో ఉద్యోగానికి రిజైన్‌ చేశాడు. కేవలం ప్రాథమిక అవసరాలతో సోలోగా పర్యటించడం మొదలు పెట్టాడు. అలా 18 నెలల్లో ఏకంగా 35 దేశాలను అన్వేషించాడు. విభిన్న సంస్కృతులు, అనుభవాల్లో మునిగిపోయాడు. కార్పొరేట్‌ బోర్డురూమ్‌ల నుంచి ప్రయాణ జీవితానికి మారడం, ఒక సరికొత్త దృక్పథాన్ని అందించింది. ఎలాంటి టార్గెట్‌లు లేని సరికొత్త లైఫ్‌ని గడుపుతున్నట్లు అనిపించింది అతడికి. 

సరిగ్గా మాంటెనెగ్రోలో పర్యటన అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. అక్కడ అతను ఆస్ట్రియాకు చెందిన సామాజిక కార్యకర్త అయిన క్యాథీని కలిశాడు. ఒక చిన్న పరిచయంగా మొదలైనది త్వరలోనే ఒక గాఢమైన బంధంగా మారింది. కేవలం 10 నిమిషాల సంభాషణ.. పది రోజుల పాటు విడిచి ఉండలేని విధంగా బలపడింది వారి బంధం. అలా వారిద్దరూ  చివరికి 2016లో పెళ్లిచేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

వారు సాంప్రదాయాల కన్నా, అనుభవాలు, స్వేచ్ఛ, ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చే జీవనశైలిని స్వీకరిస్తూ..ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి సొంతంగా ఇల్లుగానీ, కారు గానీ లేవు. జస్ట్‌ హోమ్‌స్టే లేదా అద్దెంటిలో నివశిస్తోంది ఆ కుటుంబం. భారత్‌లో పెట్టిన పెట్టుబడుల సాయంతో లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. తమ పిల్లలకు వేదాలు, ఉపనిషత్తుల తోపాటు ఎన్‌సీఈఆర్టీ పాఠ్య ప్రణాళికను ఉపయోగించి ఇంట్లోనే విద్యను అందిస్తున్నారు. అతను తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. 4 BHK ఇంటిని వదులుకుని మొత్తం ప్రపంచాన్ని పొందానని సగర్వంగా చెబుతున్నాడు. 

అంతేకాదండోయ్‌ ఇప్పుడే "జీవితాన్ని రాజులా గడుపుతున్నాను" అని పేర్కొన్నాడు. ఈ పర్యాటనలలోనే ఆ ముగ్గురు పిల్లలను కన్నారట. వారంతా సాధారణ ప్రసవం ద్వారానే పుట్టారట. డైపర్లు, ఆధునిక వైద్యం వంటివి లేకుండా పెంచారట. పైగా జీవితం అంటే ఏమవుతారని కాకుండా..మీరు ఎవరు అని తెలుసుకునేలా బోధిస్తున్నామని చెబుతోంది ఈ జంట. 

 

(చదవండి: ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తే..గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రం..)
 

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)