Breaking News

రుచి... ఆరోగ్యం... సింపుల్‌ కుకింగ్‌!

Published on Sun, 08/02/2026 - 14:30

ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్‌తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్‌ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.

కావలసినవి:
5 నుంచి 6 బ్రెడ్‌ స్లైస్‌లు, నూనె లేదా బటర్‌: 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, మినపప్పు: 1/2 టీస్పూన్, ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది), టొమాటో: 1 (చిన్నగా తరిగినది), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తరుగు: 1/2 టీస్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్, నిమ్మరసం: టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా

తయారీ:
- ముందుగా బ్రెడ్‌ స్లైసెస్‌ను ప్యాన్‌ పై కొద్దిగా కాల్చుకుని, చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
- ఆ తరువాత తాలింపు కోసం ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయండి.
- అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేయించండి.
- అందులోనే తరిగిన టొమాటో ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-టొమాటోలు మెత్తగా అయ్యే వరకు 2–3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలను వేసి, మసాలా అంతా బ్రెడ్‌ ముక్కలకు పట్టేలా చిన్నగా కలపండి.
-బ్రెడ్‌ క్రిస్పీగా అయ్యేంతవరకు 2–3 నిమిషాలు వేయించండి. చివరగా నిమ్మరసం పిండి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్‌ ఆపేయండి. అంతే వేడివేడిగా సర్వ్‌ చేయడమే!

క్యారెట్‌ పొరియల్‌
కావలసినవి: 5 క్యారెట్లు: 250 గ్రాములు (తురుము లేదా సన్నని ముక్కలు), నూనె:  టేబుల్‌ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, మినపప్పు: టీ స్పూన్, శనగపప్పు: టీస్పూన్, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), ఎండుమిర్చి: 1, కరివేపాకు: ఒక రెమ్మ, ఇంగువ: చిటికెడు, ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినది), పచ్చి కొబ్బరి తురుము: 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా.

తయారీ:
- ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనిచ్చిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి పప్పులు దోరగా మారే వరకు వేయించండి.
- అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతో పాటు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. అవి మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించండి.
- ఇప్పుడు తరిగిన క్యారెట్‌ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- మూత పెట్టి సన్నని మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి.
- క్యారెట్‌ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్‌ ఆపేయండి.
- మరింత హెల్తీ ఫుడ్‌గా మారాలంటే 15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును కూడా క్యారెట్‌తో పాటు వేసి వేయించుకోవచ్చు. అంతే! కలర్‌ఫుల్‌ క్యారెట్‌ పొరియల్‌ రెడీ!

సూజీ కేక్‌ 
కావలసినవి:  ఉప్మా రవ్వ: కప్పు, పెరుగు: 1/2 కప్పు, చక్కెర: 3/4 కప్పు, పాలు: 1/2 కప్పు (కాచి చల్లార్చినవి), నూనె లేదా వెన్న: 1/4 కప్పు, ఏలకుల పొడి లేదా వెనిలా ఎసెన్‌ ్స: 1/2 టీస్పూన్, బేకింగ్‌ పౌడర్‌: టీస్పూన్, బేకింగ్‌ సోడా: 1/4 టీస్పూన్, మిక్స్‌డ్‌ డ్రై ఫ్రూట్స్‌: 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
- ఒక బౌల్‌లో పెరుగు, పంచదార పొడి, నూనె వేసి పంచదార కరిగే వరకు బాగా కలపండి.
- ఇప్పుడు అందులో రవ్వ, సగం పాలు పోసి బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి.
- ఇపుడు ఒక పెద్ద ప్రెజర్‌ కుక్కర్‌ లేదా మందపాటి కడాయిలో అడుగున కప్పు ఉప్పు లేదా ఇసుక వేసి, దానిపై ఒక స్టాండ్‌ ఉంచండి.
- విజిల్, గాస్కెట్‌ తీసేసి మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ప్రీ–హీట్‌ చేయండి.
- ఆ తరువాత కేక్‌ గిన్నెకి కొద్దిగా నూనె రాసి, పొడి పిండి చల్లండి లేదా బటర్‌ పేపర్‌ వేసి పక్కన పెట్టండి.
- నానిన రవ్వ మిశ్రమం గట్టిపడితే మిగిలిన పాలు పోసి కేక్‌ బ్యాటర్‌ని చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులో బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా, ఏలకుల పొడి/వెనిలా ఎసెన్‌ ్స వేసి ఒకే దిశలో నెమ్మదిగా కలపండి.
- ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌ లో పోసి, పైన టూటీ ఫ్రూటీ లేదా జీడిపప్పు ముక్కలు చల్లండి.
- ప్రీ–హీట్‌ చేసిన కుక్కర్‌లో ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 35 నుంచి 45 నిమిషాలు బేక్‌ చేయండి.
- తరువాత  కేక్‌ మధ్యలో టూత్‌పిక్‌ లేదా చాకు గుచ్చి చూడండి.
- అది క్లీన్‌ గా బయటకు వస్తే కేక్‌ సిద్ధమైనట్లే! కేక్‌ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుంచి బయటకు తీసి ముక్కలుగా కోయాలి.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)