Breaking News

Puri Rath Yatra 2025: వస్తున్నాయ్‌..జగన్నాథ రథచక్రాల్‌

Published on Wed, 06/18/2025 - 14:40

భువనేశ్వర్‌: ఈ ఏడాది జరగనున్న పూరీ జగన్నాథుని రథ యాత్రకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. యాత్ర సమీపిస్తుండటంతో, జగన్నాథుని రథాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. పూరిలోని రథ ఖాలా వద్ద శ్రీ జగన్నాథుని రథం నందిఘోష బలభద్రుని తాళ ధ్వజం, దేవీ సుభద్ర దర్ప దళనం అనే 3 రథాలు శ్రీ మందిరం శిఖరంతో సరిసమానంగా ఎదుగుతున్నట్లు అబ్బురపరుస్తున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి యాత్ర తయారీ కార్మిక విభజనకు నిలువెత్తు తార్కాణం. అట్టడుగు నుంచి నిలువెత్తు వరకు రథాల తయారీ పనులు గొలసు కట్టుగా కొనసాగుతున్నాయి. రథాల తయారీ శాలలో వడ్రంగులు, చేతి వృత్తులవారు, ముఖ్యంగా మహరణ, భోయి సేవకులు సంప్రదాయ గడువు ప్రకారం కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 3 రథాల పనులు ఒకే క్రమంలో నిబద్ధతతో నిర్వహించడంతో ఒకే స్థాయిలో అంచెలంచెలుగా తయారీ పూర్తవుతుంది.  

ఒక్కో రథం బహుళ అంతస్తు భవనాన్ని పోలి ఉంటుంది. రథంపై భగవంతుని పీఠం పైభాగాన 3 మిద్దెలతో రథాల తయారీ నింగిని తాకే ఊపుతో ఎదుగుతుంది. ప్రతి రథం యొక్క మూడవ మరియు చివరి మిద్దె (ఒఘా భూయి) తయారీ పూర్తయ్యింది.

భద్రతకు ప్రాధాన్యత: సంప్రదాయబద్ధంగా వడ్రంగుల చేతిలో తయారు అవుతున్న 3 భారీ రథాల్లో ప్రతి అంశాన్ని అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం నుంచి గుండిచా మందిరం వరకు పోకరాకలు చేయాల్సిన రథాలకు చక్రాలకు మూలాధారం. వీటి పటిష్టతకు భద్రత  కల్పించే దిశలో చక్ర రక్షకులు (పొరా భొఢి) తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దైవిక ప్రయాణానికి రథాల తయారీ సింహ భాగం పూర్తయ్యింది.

నేల నుంచి నింగికి: జతతి నాథుడు యాత్ర చేసే రథం నేల నుంచి నింగికి ఎగసినట్లు తయారవతుంది. చక్రాల నుంచి రథ శిఖరం వరకు అందం కనులు మిరమిట్లు గొలుపుతుంది. ఈ అందాన్ని ఆవిష్కరించడంలో క్లిష్టమైన కళాత్మక రంగుల మేళవింపుతో అలంకరించడంలో చిత్రకారులు హుషారుగా పని చేస్తున్నారు. రథం పార్శ్వ తోరణాల్ని (పట్టొ గుజొ)   సేవకులు సాంప్రదాయ మూలాంశాలను రూపకారులు చెక్కుతున్నారు. 

నలువైపులా అలంకృత చెక్కలు: రథం అందాల్ని ప్రతిబింబించడంలో నలు వైపుల ఆకర్షణీయమైన అలంకార చెక్క తోరణాల (ఫొటొలొ) అమరిక కీలకమైన నైపుణ్యత. రథాలపై నిలిపిన మిద్దెలు పట్టు కోల్పోకుండా దిట్టంగా ఉండేందుకు అంతర్భాగంలో వంపు తిరిగిన చెక్కల్ని (సేని) ఆధారంగా జోడిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)