Breaking News

పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడు నెలలకు ట్విస్ట్‌!

Published on Thu, 02/13/2025 - 09:34

నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు  ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది. 

గంటలు గంటలు మేకప్‌ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం,  తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్‌ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.
– ఆదినారాయణ, హైదరాబాద్‌

ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్‌లైన్‌ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు. 

తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్‌ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్‌ లేదా క్లినికల్‌ సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 

తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్‌ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)