Breaking News

హెచ్‌పీవీ–ఫ్రీ ఇండియా

Published on Sun, 08/17/2025 - 04:42

సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా, భవిష్యత్‌ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్‌పీవి వ్యాక్సిన్‌ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్‌గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్‌పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది. 

తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. 

చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్‌పీవి టీకా తీసుకున్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ సర్వైకల్‌ క్యాన్సర్‌కు మాత్రమే కాకుండా వెజైనల్‌ క్యాన్సర్, వల్వర్‌ క్యాన్సర్‌లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్‌గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)