Breaking News

మనలో కూడా దాగున్న ఈ జబ్బు ఇంత ప్రమాదమా!?

Published on Sat, 07/18/2026 - 08:03

సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం... ఏదైతేనేం? చేయాల్సిన పనులు ఆపేయడానికి..? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ‘వాయిదా’ల అటకెక్కించడానికి..? నిజానికి ఇలాంటి బద్ధకస్తుల జాబితాలో మన చుట్టూ ఉన్నవాళ్లే కాదు మనం కూడా కొన్నికొన్ని సార్లు చేరిపోతుంటాం. ఎందుకంటే వాయిదా వేయడం కొందరికి అలవాటు.. మరికొందరికి అదోరకం కంఫర్ట్‌. నేటి యువతలో ఎక్కువగా కనిపించే లక్షణం సోమరితనం. కాని జపాన్‌ ప్రజలు మాత్రం వారి పిల్లలకి సోమరితనాన్ని ఒక బూచిలా చూపిస్తారు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా సోమరితనాన్ని మెల్లమెల్లగా దూరం చేస్తారు. జపాన్‌లో సోమరితనాన్ని దూరం చేసే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏడు జీవన సూత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.కైజెన్‌
పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏదైనా చిన్న లక్ష్యంతో ప్రారంభించండి. క్రమక్రమంగా లక్ష్యాలను పెద్దగా మార్చుకుంటే  మీ బ్రెయిన్‌కి మీరే గురువుతారు.

2. ఇకిగై
ఏం చేయాలన్న దాని మీద స్పష్టత లోపించినప్పుడే పనులు సక్రమంగా సాగవు. అందుకే ‘ఏం చేయాలి?’ అని కాకుండా ‘ఎందుకు చేయాలి?’  అని ఎవరికి వారే ప్రశ్నించుకోగలిగినప్పుడు పని మీద గురి కుదురుతుంది.

3. హరా హచి బు
ఏదైనా మితంగా తినడం మంచిది. బిర్యాని అంటే ఇష్టమని పొట్ట పగిలేలా తినకుండా 80 శాతం ఆకలి తీరినంత వరకే తినాలన్నది జపాన్‌ సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శరీరం తేలికగా ఉండడమే కాకుండా మెదడు కూడా చురుకుగా మారుతుందని జపాన్‌ ప్రజలు భావిస్తారు.

4. సెయిరి – సెయితోను
మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ప్రతి వస్తువు క్రమ బద్ధంగా, వీలైనంత వరకు కాస్త నిశబ్ధంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేస్తున్న పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.

5. కింట్సుగి
కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. తప్పులు దొర్లవచ్చు. భయపడకండి. ధైర్యంతో ఎదుర్కోండి. తప్పులను ఒప్పుకోండి. లోపాలను అంగీకరించండి...అలా చేసినప్పుడే నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.

6. వాబి  సాబి
ప్రతి క్షణం విలువైనదే.. మొదలు పెట్టేవరకు ఏదీ పూర్తి కాదు. ఇంకా సమయం కావాలని ఆలోచించక ఉన్న వనరులతో పని మొదలుపెట్టండి. విశ్వాశమే విజయానికి తొలిమెట్టు.

7. యాంకర్డ్‌ ఫోకస్‌
ప్రతిసారి గంటల తరబడి కుర్చుని పని చేయడం కంటే ప్రతి పనిని మొదలు పెట్టే ముందు గట్టిగా శ్వాస తీసుకోండి. తర్వాత నచ్చిన మ్యూజిక్‌ కొన్ని నిమిషాల పాటు వినండి. ఆ తర్వాత పనిని మొదలు పెట్టండి. ప్రతి 25 నిమిషాలకొకసారి లేచి ఓ ఐదు నిమిషాల పాటు విరామం తీసుకోండి. దీని వల్ల శరీరంలో ఉత్సాహంతో పాటు పనిలో ఉత్పాదకత పెరుగుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)