ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్
Breaking News
సీతమ్మ చీర సిత్రాలు..! మైండ్‌బ్లోయింగ్ ట్రెడిషనల్ లుక్స్
Published on Tue, 10/20/2026 - 11:47
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీడియోల్, రావణుడిగా యశ్ నటించారు. ఈ మూవీ ప్రేక్షకులకు చేరువయ్యేలా చిత్ర బృందం పలు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఆ నేపథ్యంలో హెదరాబాద్ చేరుకుని ఇక్కడ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మొత్తం చిత్ర బృందం పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
హైదరాబాద్‌లో తెలుగు రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని శ్రేయా మీడియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సాయిపల్లవి, రణబీర్‌కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్, రవి దూబే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో సాయిపల్లవి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు హైదరాబాద్‌లో అభిమానులు ఆమెకు గులాబీ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. సింపుల్సిటీకి కేరాఫ్‌గా ఉండేఆ ఆమె ఈ వేడుకలో పర్పుల్ కలర్ టిష్యూ సిల్క్ చీరలో మెరిసింది.
అచ్చం సీతమ్మలా తన ఆహార్యంతో కట్టిపడేసింది ప్రేక్షకుల్ని. నాణ్యమైన చేనేత వస్త్రం,బంగార జరీ పని, వెటాల్కి మెరుపు..ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయ్. ఆ చీరకు జతగా ధరించి బ్లౌజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్లౌజ్‌పై ముందు వెనుక భాగాల్లో క్లిష్టమైన జరీ వర్క్ ఉంది. దీనికి అనుగుణంగా జత డ్రాప్ ఇయర్రింగ్స్, రత్నాలు పొదిగిన కడాలు, ఎడమ చేతికి చుట్టిన జపమాలతో ఎప్పటిలా సింపుల్ మేకప్‌తో అత్యంత నేచురల్‌గా కనిపించింది.
కాగా, ఢిల్లీ, ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సైతం.. ఇలానే అందమైన పట్టు చీరల్లో మెరిసి అందర్నీ ఆకట్టుకుంది సాయిపల్లవి. కాగా, నాలుగువేల కోట్ల ప్రాజెక్టు అయిన ఈ రామయణ మూవీ రెండు భాగాలుగా విడుదలకానుంది. మొదటి భాగం ఈ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండోభాగం 2027లో విడుదల కానుంది.
ఫ్యాషన్ పాఠాలివే..
సందర్భానికి అనుగణంగా మనం ధరించే దుస్తులు ఉండాలని నటి సాయిపల్లవి ధరించే ఫ్యాషన్ వేర్ల నుంచి తెలుస్తోంది. రామాయణ మూవీలో తన సీత పాత్రకు అనుగుణంగా లుక్ ఉండేలా ప్రతి ప్రమోషన్లో కేర్ తీసుకోవడం విశేషం.
విభిన్నమైన పట్టు చీరలు, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడినవే ఎంచుకుని మన సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతూ..సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలుస్తోంది
ప్రతి చీరకు ఆభరణాలు కాదు ..చీర డిజైన్ని బట్టి ధరించాలని ఆమె స్లైలింగ్ శైలి చెబుతోంది.
అలాగే నేచరల్ లుక్‌లో అందమే అసలైన అందమని ప్రతిసారి తన ఆహార్యంతో చెప్పకనే చెబుతోంది సాయిపల్లవి
ఇదీ చదవండి: డ్రాగన్ ఫ్రూట్‌తో ఏడాదికి రూ. 2 కోట్లు..! జస్ట్ మూడు ఎకరాల నుంచి..
Tags : 1