Breaking News

స్వదేశీ విశ్వరూపం.. సర్వం విజయం

Published on Thu, 02/26/2026 - 05:58

దిల్లీ ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026 సాక్షిగా ‘సర్వం ఏఐ’ సగర్వంగా చెప్పకనే చెప్పింది. ‘వరల్డ్‌–క్లాస్‌ హార్డ్‌ టెక్నాలజీ ఇండియాలో కూడా సాధ్యమే’ అని! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘సర్వం’ విజయం ఆ కంపెనీ వ్యవస్థాపకుల సమర్థతకు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ‘మన దేశం–మన కంపెనీ’ అని కలలు కనే ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్‌ల విజయం. ‘మేధోవలస’కు చేయి అడ్డు పెట్టి...‘ఎక్కడో ఎందుకు? మన దేశంలోనే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చే విజయం....

‘పీహెచ్‌డీలు ముఖ్యం కాదు. కంపెనీకి సరిగ్గా అవసరమైన వారే ముఖ్యం’ అంటూ  ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా స్వదేశంలో ప్రయాణం మొదలుపెట్టిన వివేక్‌ రాఘవన్, ప్రత్యూష్‌ కుమార్‌లు ‘సర్వం ఏఐ’తో సత్తా చాటారు. లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం) నుంచి నిన్నా మొన్నటి ‘సర్వం కేజ్‌’ స్మార్ట్‌గ్లాసెస్‌ వరకు, ఏ.ఐ మోడల్స్‌ శిక్షణకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం వరకు... సర్వం సాంకేతికమయం!

సర్వం సక్సెస్‌ మంత్రా
ఒక స్టార్టప్‌ సక్సెస్‌ కావడానికి, సూపర్‌ సక్సెస్‌ కావడానికి ఏం ఉండాలి? ‘సర్వం ఏఐ’ ఫౌండర్‌లలో ఒకరైన వివేక్‌ రాఘవన్‌ మాటల్లో చె΄్పాలంటే ‘ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి’

ఇండియా నుంచి వరల్డ్‌ క్లాస్‌ మోడల్స్‌ను నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరింది సర్వం. ‘మా విజయం ఎలా ఉండాలంటే ఇతర డెవలపర్‌లు, స్టార్టప్‌లు కూడా యస్‌...మేము కూడా ప్రపంచంతో ΄ోటీ పడుతూ వరల్డ్‌–క్లాస్‌ మోడల్స్‌ను నిర్మించగలం అనే నమ్మకాన్ని పాదుకొల్పేంతగా’ అన్నారు వివేక్‌. ‘వీరి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది. సాధించగలరా?’ అని కొందరికి సందేహం వచ్చింది.

పగటి కలలకే పరిమితమై ఉంటే వారి కలలు కలలుగానే ఉండేవి. అయితే వారు రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు.

ఇది యువత విజయం
తొలి అడుగులు వేస్తున్నప్పుడు ‘సర్వం’ టీమ్‌లో ఉన్నది సాంకేతిక ఉద్దండులు కాదు. నవ యువకులు! ‘వీరితో విజయం సాధ్యమా?’ అని కూడా కొందరికి సందేహం వచ్చింది. ‘కచ్చితంగా సాధ్యమే’ అని నిరూపించింది సర్వం. అందుకే...‘‘మా సంస్థ విజయాన్ని భారతదేశ యువత విజయంగా కూడా నేను భావిస్తున్నాను’ అంటారు వివేక్‌. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సిలికాన్‌ వ్యాలీలో గెలుపు జెండా ఎగరేసిన తరువాత స్వదేశీ బాట పట్టారు. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బయలుదేరారు.

పీహెచ్‌డీ... పెద్ద విషయం కాదు!
‘మీ ఇద్దరికీ పీహెచ్‌డీ ఉంది. సిలికాన్‌ వ్యాలీలో ఉన్నట్లు పీహెచ్‌డీ చేసిన డీప్‌–టెక్‌ వ్యవస్థాపకులు మన దేశంలో పెద్దగా కనిపించరు’ అనే ప్రశ్నకు ‘నిజమే!’ అని కాలర్‌ ఎగరేయలేదు వివేక్‌. ‘పీహెచ్‌డీ అనేది పెద్ద విషయం కాదు. సంస్థకు పనికొచ్చే సామర్థ్యమే ముఖ్యం. పీహెచ్‌డీ వరకు ఎందుకు? హైస్కూల్‌ స్థాయిలో కూడా అద్భుత ప్రతిభæ చూపుతున్న విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం. నాకు పీహెచ్‌డీ ఉన్నప్పటికీ దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. పీహెచ్‌డీలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. కంపెనీకి అవసరమైన సరిౖయెన వ్యక్తిని ఎంచుకోవడమే ముఖ్యం’ అంటారు వివేక్‌.

వివేక్‌ రాఘవన్, ప్రత్యూష్‌ కుమార్‌లు వ్యవస్థాపనలో బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘సర్వం’ 2023లో ప్రారంభమైంది. భారతీయ భాషలలో లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం)ను అభివృద్ధి చేసింది. స్పీచ్‌–టు–టెక్ట్స్, విజన్‌–లాంగ్వేజ్‌ మోడల్స్‌లాంటి మల్టీ మోడల్స్‌ను, సిస్టమ్స్‌ను కూడా కంపెనీ డెవలప్‌ చేసింది. ‘సర్వం విజన్‌’ పేరుతో విజన్‌–లాంగ్వేజ్‌ మోడల్‌ని పరిచయం చేసింది.

గత సంవత్సరం సర్వం ఏఐ ‘ఇండియా ఏఐ మిషన్‌’కు ఎంపికైంది. డొమెస్టిక్‌ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మోడల్‌ డెవలప్‌మెంట్‌కు ఈ మిషన్‌ స΄ోర్ట్‌ చేస్తుంది. ‘ఏఐ ఫర్‌ భారత్‌’తో పాటు లాంగ్వేజ్‌ డాటాబేస్, స్పీచ్‌ రిసెర్చ్‌కు సంబంధించి విద్యాసంస్థలతో కలిసి పనిచేసింది సర్వం.
 
ఇద్దరూ ఇద్దరే
వివేక్‌ రాఘవన్‌ ఐఐటీ–దిల్లీ నుండి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ–బాంబే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ప్రత్యూష్‌ కుమార్‌కు కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధనకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. జ్యూరిచ్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. ఇద్దరు ప్రతిభావంతులు ఒక దగ్గర చేరితే అద్భుతాలు జరుగుతాయనేది నిజమే అయినా, ఆ ప్రతిభావంతులు తమలాంటి వారి కోసం అన్వేషించి, తమ జట్టులో చేర్చుకోవడమే అసలుసిసలు అద్భుతం.

రిస్క్‌ తీసుకోక΄ోవడమే పెద్ద రిస్క్‌!
సిలికాన్‌ వ్యాలీ తన ఆలోచన తీరును మార్చింది అంటారు వివేక్‌ రాఘవన్‌. ‘మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా రిస్క్‌ తీసుకోవాలి’ అనేది సిలికాన్‌ వ్యాలీ చెప్పిన పాఠం. ‘ఇతరత్రా రిస్క్‌లతో ΄ోల్చితే టెక్నాలజీ రిస్క్‌ అనేది భిన్నమైది’ అనే విషయం తెలిసినా  ‘సై’ అంటూ స్వదేశీ బాట పట్టారు వివేక్‌ రాఘవన్‌.

నెట్‌ అవసరం లేదండీ!
‘ఎడ్జ్‌’ అనే కొత్త ఆన్‌–డివైజ్‌ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది సర్వం ఏఐ. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. స్పీచ్‌ రికగ్నిషన్, ట్రాన్స్‌లేషన్, టెక్స్‌›్ట–టు–స్పీచ్‌లాంటి పనులెన్నో చేస్తుంది. డివైజ్‌లోనే డాటా ప్రాసెస్‌ చేయబడినందున యూజర్‌లు సమాచారాన్ని క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేదు. ‘ఈ మోడల్‌ వేగం, గోప్యత, విశ్వసనీయతపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో ప్రధాన భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది.

ఇండస్‌ 
స్వదేశీ స్టార్టప్‌ సర్వం ఏఐ ‘ఇండస్‌’ అనే కొత్త ఏఐ చాట్‌బాట్‌ యాప్‌ను తీసుకువచ్చింది. ‘భారతీయ వినియోగదారుల కోసం భారత్‌లో రూపొందించిన యాప్‌ ఇది’ అని ప్రకటించింది కంపెనీ. చాట్‌జీపీటీ, జెమినివంటి ప్రసిద్ధ చాట్‌బాట్‌ల మాదిరిగానే ‘ఇండస్‌’లో ఫీచర్‌లు ఉన్నాయి. యూజర్‌లు వాయిస్‌ కమాండ్‌లు ఇవ్వవచ్చు. ప్రశ్నలను టైప్‌ చేయడానికి బదులుగా మాట్లాడవచ్చు. ఏఐ వెబ్‌లో శోధించవచ్చు. స్పష్టమైన సమాధానాలను తెలుసుకోవచ్చు, లోతైన పరిశోధన చేయవచ్చు. నేరుగా యాప్‌లోనే డాక్యుమెంట్లు రాయవచ్చు. ఇమేజ్‌లు, పీడీఎఫ్‌లు, ఫైళ్లను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని మరో ప్రత్యేకత భాషా సౌలభ్యం.

Videos

కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది

భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్

పవన్ పై అనుమానాలు.. మండిపడుతున్న జనసేన నేతలు

Tatiparthi Chandrasekhar : వెలిగొండలో బాబు క్యాట్ వాక్, ర్యాంప్ వాక్

తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు

Hyd: రిజర్వాయర్ లో కారు బోల్తా.. డ్రైవర్ గల్లంతు

Komarada Nagavali River:ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ

Photos

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)