Breaking News

బొమ్మలాట

Published on Mon, 09/15/2025 - 04:05

ఒక ఊర్లో ఓ మోతుబరి రైతు ఉండేవాడు. బాగా సంపాదించిన అతడికి వయసుపైబడింది. వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతడిలో ప్రాణ భయం పట్టుకుంది. ఒక రోజు పొలం పనుల మీద పక్క ఊరికెళ్ళాడు. చిన్నగా మొదలైన వాన చినుకులు కొద్దిసేపటికే  పెద్ద వర్షంగా మారింది. అటూ ఇటూ చూశాడు. దూరంగా పెద్ద మర్రిచెట్టు కనిపించింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద మట్టితో బొమ్మలు తయారు చేసే కుమ్మరి  ఉన్నాడు. రకరకాల అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నాడు.

ఇంతలో వాన ఉధృతమయ్యింది. వానకి మట్టి బొమ్మలు కొన్ని చిన్నచిన్నగా కరిగిపోసాగాయి.దాన్ని కళ్ళారా చూసిన రైతు, ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ‘‘నీకు బాధగా లేదా?’’ అని అడిగాడు. ‘‘బాధగా లేదు. ఇది సహజం!’’ అని బదులిచ్చాడు కుమ్మరి. ‘‘ఎందుకు బాధ లేదని చెబుతున్నావు? నీకు నష్టం  జరుగుతోంది కదా’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రైతు.‘‘ఈ మట్టి బొమ్మలు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు. అవి మట్టితో తయారు చేసినవి. 

మట్టినుంచి వచ్చినవి మట్టిలోకే కదా పోతాయి. దానికెందుకు బాధపడాలి. నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. మరింత కష్టపడి మరిన్ని బొమ్మలు తయారు చేయగలను, ఈ జానెడు పొట్ట నింపుకోగలను.నిజంగా ఈ మట్టిబొమ్మల మీద నాకు ఏ హక్కూ లేదు. కారణమేమిటంటే అవి ప్రకృతిలో ఉచితంగా దొరికిన మట్టితో తయారు చేయబడినవి. అది ప్రకృతి నాకిచ్చిన అవకాశం. 

ఈ మట్టిని  బొమ్మలుగా మార్చి నా పొట్ట గడుపుకుంటున్నానని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను లాభాలకు పొంగిపోను, నష్టాలకు క్రుంగి పోను. నిజం చె΄్పాలంటే ఈ కరిగిపోతున్న మట్టిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవి పుట్టింటికి వెళ్తున్నాయన్న స్పృహ నాకుంది’’ అని బదులిచ్చాడు.
కుమ్మరి చెప్పిన జీవిత సత్యం విని రైతు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తనకి  అన్వయించుకున్నాడు. ‘మన జీవితం కూడా మూన్నాళ్ళ ముచ్చటే కదా. దేవుడు ఆడించే బొమ్మలాటే కదా. ఎక్కడినుంచి వచ్చామో, అక్కడికి వెళ్ళడం ఎవ్వరికైనా తప్పదు కదా’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతలో వాన నిలవడంతో అక్కడినుంచి కదిలాడు రైతు. 

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు

1
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)