Breaking News

క్రంచీ..క్రంచీ ఎల్లు చిక్కీ: చాలా సింపుల్‌గా, చక చకా !

Published on Sat, 01/06/2024 - 16:12

సంక్రాంతి అంటేనే స్వీట్ల పండుగ. అరిసెలు, పూతరేకులు, కొబ్బరి బూరెలు, కరకజ్జ, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌ చాలా పెద్దదే.  అయితే వీటికి సమయంతోపాటు, నైపుణ్యం కూడా కావాలి. అందుకే చాలా తేలిగ్గా, తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే స్వీట్‌ గురించి తెలుసుకుందాం.  

ఎల్లు చిక్కీ. అంటే నువ్వులు ( తెల్లవి, నల్లవి) బెల్లంతో  కలిపి తయారుచేసుకునే  రుచికరమైన , క్రిస్పీ స్వీట్. ఎల్లు అంటే తమిళంలో నువ్వులు అని అర్థం. నువ్వుల చిక్కిని ఎల్లు మిట్టై, నువ్వుల బర్ఫీ,టిల్ చిక్కి అని కూడా అంటారు.  ఇందులో జీరో షుగర్ , జీరో ఆయిల్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్‌గా హ్యాపీగా తినవచ్చు ముఖ్యంగా నువ్వులు పెరుగుతున్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. వృద్ధులు, మహిళల ఆరోగ్యం కోసం ఎల్లు చిక్కీని నెలకోసారి చేసుకుని రోజూ కనీసం ఒక్క పట్టీ అయినా తినాలి.


కావలసిన పదార్థాలు  నువ్వులు – పావు కేజీ; బెల్లం – పావు కేజీ; నెయ్యి –కొంచెం

ఎలా చేసుకోవాలి? 
నువ్వులను మందపాటి పెనంలో వేసి సన్నమంట మీద వేయించాలి. చిటపట పేలడం మొదలు పెట్టిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అపుడు స్టవ్‌ ఆపేసి పెనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మరొక పాత్రలో బెల్లంతోపాటు, కొద్దిగి నీళ్లు వేసుకుని, మరిగేవరకు మీడియం మంట మీద ఉంచాలి. కరిగిన తర్వాత మంట తగ్గించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌కు నెయ్యి రాసి బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని వేసి పూరీల కర్రతో అంతటా ఒకేమందం వచ్చేటట్లు వత్తాలి. వేడి తగ్గిన తర్వాత చాకుతో ఇష్టమైన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ప్లేట్‌ నుంచి వేరు చేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు వారాల పాటు నిల్వ ఉంటాయి.   వేరుశెనగలను కూడా కలుపుకొని కూడా కావాలంటే లడ్డూల్లా కూడా తయారు చేసుకోవచ్చు.  వీటిల్లో ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దగా నెయ్యి అవసరం పడదు.

 ఎల్లు  చిక్కీ లాభాలు
ఫైబర్  కంటెంట్‌ ఎక్కువ
మలబద్దకాన్ని నివారిస్తుంది, వాపులను తగ్గిస్తుంది
పొత్తికడుపు కొవ్వును  కరిగిస్తుంది.
ఎనర్జీ బూస్టర్‌, జీర్ణ ఆరోగ్యం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)