Breaking News

'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ

Published on Sun, 01/12/2025 - 10:56

‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్‌ కామత్‌(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)   తొలి పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. 

ఆ ఇంటర్వ్వూలో కామత్‌ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్‌(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్‌లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్‌లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు. 

ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్‌లో ఫుడ్‌ ఎలా ఆర్డర్‌ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్‌ని ఆర్డర్‌ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది.

(చదవండి:  నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. )
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)