Breaking News

Maa Shabri..రామ సన్నిధిలో శబరి గీతం: మైథిలీ ఠాకూర్‌

Published on Fri, 01/26/2024 - 00:21

అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో మంత్రాలు, స్తోత్రాలతోపాటు భక్తి సంగీతం కూడా భక్తులను తన్మయత్వానికి గురి చేసింది. శంకర్‌ మహదేవన్, సోను నిగమ్‌ వంటి
సీనియర్‌ గాయకులతో పాటు రామ సన్నిధిలో ‘శబరి గీతం’ వినిపించిన బిహార్‌ గాయని మైథిలీ ఠాకూర్‌ ప్రత్యేక ప్రశంసలు పొందింది. నరేంద్ర మోడీ ఆమె గురించే ప్రత్యేకంగా ట్వీట్‌ చేశారు. ఆరేళ్ల వయసు నుంచి భక్తి సంగీతాన్ని వినిపిస్తున్న మైథిలీ ఠాకూర్‌ పరిచయం.


‘శబరీ సవారె రాస్తా ఆయేంగె రామ్‌జీ’...
(శబరి వీధుల్ని అలంకరిస్తోంది రాముని రాక కోసం)...

అని పాడిన మైథిలీ ఠాకూర్‌ పాటను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. బాలక్‌ రామ్‌ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో మైథిలీ ఠాకూర్‌ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయడమే కాదు... ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయప్రాంగణంలో రాముని భజనలు కూడా పాడింది. దేశం మొత్తంలో ఇలాంటి అవకాశం పొందిన అతి చిన్న వయసు గాయని మైథిలి. 21 ఏళ్ల వయసులో ఇంత గుర్తింపు పొందడానికి కారణం ఎడతెగని సాధన, సంగీతం పట్ల ఆరాధనే.

బిహార్‌ అమ్మాయి
మైథిలీ ఠాకూర్‌ది బిహార్‌లోని మధుబని. తండ్రి రమేష్‌ ఠాకూర్‌ భజన గాయకుడు. అందువల్ల బాల్యం నుంచి తండ్రితో పాటు భజనలు పాడేది మైథిలి. ఇంట్లో ఏదో ఒక సమయంలో రామ్‌సీతా  కీర్తనలు కొనసాగుతుండేవి. మైథిలిని తన వారసురాలిగా చేయాలని తండ్రికి ఉండేది. అందుకుని పదేళ్ల వరకూ స్కూల్‌కే పంపకుండా సంగీతంలో సాధన చేయించాడు. అయితే మైథిలికి గుర్తింపు మాత్రం వెంటనే రాలేదు.

గెలుపూ ఓటమి
మైధిలి భవిష్యత్తు కోసం ఢిల్లీకి మకాం మార్చాడు తండ్రి. ఢిల్లీలోని బాలభవన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నేరుగా ఆరవ తరగతిలో చేరిన మైథిలి మొదటిసారి స్కూల్‌ ముఖం చూడటం, అక్కడ ఇంగ్లిష్‌ రాక అవస్థ పడటం కొనసాగిస్తూనే సంగీతాన్ని సాధన చేసింది. ఢిల్లీలో మైథిలి కచ్చేరీలు చేసినా అందరికీ తెలిసేటంతటి పేరు రాలేదు. ఆ సమయంలోనే అంటే 11 ఏళ్ల వయసులో ‘లిటిల్‌ చాంప్‌’, ‘ఇండియన్‌ ఐడల్‌ 2’ వంటి రియాలిటీ షోస్‌కు వెళ్లి ఫెయిల్‌ అయ్యి తిరిగి వచ్చింది మైథిలి.

దశ తిరిగింది
2017లో కలర్స్‌ టీవీలో ‘రైజింగ్‌ స్టార్‌’ అనే సింగింగ్‌ రియాలిటీ షో మైథిలి దశ తిప్పింది. ఆ షోలో మైథిలి రన్నర్‌ అప్‌గా నిలిచింది. ముంబైలో ఈ షో చేసి తిరిగి వచ్చాక ఢిల్లీ నుంచే తాను లోకానికి తెలియానుకుంది. వెంటనే సోషల్‌ మీడియాలో తన పాటలను పోస్ట్‌ చేయడం మొదలెట్టింది. మైథిలికి ఇద్దరు తమ్ముళ్లు–రిషబ్, అయాచి ఉన్నారు. వారిద్దరు తబలా, డోలక్‌ వాయిస్తారు. మైథిలి హార్మోనియం వాయిస్తుంది.

వీరు ముగ్గురు కలసి పాటల వీడియోలు రిలీజ్‌ చేయడం మొదలెట్టారు. పెద్ద హిట్‌ అయ్యాయి. సినిమా పాటలే కాకుండా బిహార్‌లోని జానపద సంగీతాన్ని, పంజాబీ, గుజరాతీ, కేసరియా, బజ్జిక వంటి సంగీత ధోరణులను వీడియోలుగా రిలీజ్‌ చేసింది మైథిలి. అంతేకాదు భజన సంగీతాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు యూట్యూబ్‌లో 20 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో, ఫేస్‌బుక్‌లో లక్షల ఫాలోయెర్లు ఉన్నారు. ఆ ప్రఖ్యాతి మైథిలిని రాముని పాదాల వరకూ చేర్చింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)