Breaking News

‘మై లవ్‌..’గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్‌ వీడియో

Published on Sat, 06/14/2025 - 16:59

Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా  రోదిస్తున్న  వీడియో వైరల్‌గా మారింది.

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం  యావద్దేశాన్ని  దిగ్భ్రాతిలో  ముంచెత్తింది.  ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన  వారు  రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో  కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం   ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు,  ‘మై లవ్‌ అంటూ  సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు  తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి  చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ  జర్నలిస్ట్ వీడియోను షేర్‌ చేశారు. 

జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు. 

 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)