అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
పైలట్ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఏంటో తెలుసా ..!
Published on Sun, 03/22/2026 - 11:24
పైలట్ వృత్తిలో ఉండే వ్యక్తులకు మర్చిపోలేని ఫ్లైట్ జర్నీలు ఉంటాయని తెలుసా. అందరీ పైలెట్లకి రెండు ఫ్లైట్ జర్నీలు అత్యంత సర్వసాధారణం. మూడోది మాత్రం.. కొందరికే దొరికే సువర్ణావకాశం. అలాంటి లక్కీఛాన్స్ కొట్టేశాడు ఈ పైలట్. ఆ పట్టరాని సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఇలా.
ఆ వ్యక్తే కెప్టెన్ అజమ్ అల్లి. ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ మధురమైన క్షణాన్ని కెమెరాలో బంధించి మరి పంచుకున్నారు. విమానంలో ప్రత్యేక ప్రకటన ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకంటూ ఇలా చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో ఆయన శుభోధయం, లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటూ స్పీచ్ స్టార్ట్ చేసి..మీ ఫైట్ డెక్ నుంచి మీ కెప్టెన్.. ఐయామ్ కెప్టెన్ అజమ్ అల్లి, అంటూ భావోద్వేగంగా మాట్లాడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పైలట్ జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయంటూ వాటిని వివరిస్తాడు. ఒక పైలట్‌కి ఎప్పటికీ మర్చిపోలేని మూడు ప్రయాణాలు ఉంటాయని పేర్కొన్నాడు.
వాటిలో మొదటిది సోలో ఫ్లైట్ అని, దాదాపు 24 సంవత్సరాల క్రితం భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ఉన్నప్పుడు తనకు ఎదురైన జర్నీ అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. రెండో ముఖ్యమైన ఘట్టం పదవీ విరమణకు ముందు చేసే చివరి విమానం ప్రయాణం. అయితే ఆ మైలురాయి తనకు ఇంకా దాదాపు రెండు దశాబ్దాల దూరంలో ఉందని అన్నారు. అన్నింట్లకంటే మూడో ఘట్టం అన్నింటికన్నా ప్రత్యేకమైనదంటూ ఇలా చెప్పారు.
మూడోది బహుశా ఇది అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విమాన ప్రయాణం..ఎందుకుంటే కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం లభించడం. ఈ రోజు నాకు అలాంటి రోజే ఎదురైంది. నా భార్య, పిల్లలు, ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన మాటలు ముగిసిన వెంటనే..విమానంలోని ప్రయాణికులు చప్పట్లు కొడుతూ, చిరునవ్వులతో స్పందన తెలిపారు. కెప్టెన్ అల్లి ఈ వీడియోకి "ఒక పైలట్ ఎప్పటికీ మరచిపోలేని మూడు విమాన ప్రయాణాలు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.
(చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!)
Tags : 1