Breaking News

ఏఐ వింతలు: చనిపోయినవారితో జూమ్‌ కాల్‌, మాటామంతీ

Published on Tue, 06/24/2025 - 15:29

అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?
సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...
అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్‌ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)
గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.
మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?

అదంతా ‘గ్రీఫ్‌బాట్స్‌’ మహిమ!

‘గ్రీఫ్‌బాట్స్‌’ (Griefbots) లేదా ‘డెట్‌బాట్స్‌’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్‌లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌(ఎల్‌ఎల్‌ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి.

 ప్రాజెక్ట్‌ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్‌ యూ, వోన్లీ వర్చువల్‌... మొదలైన స్టార్టప్‌లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్‌లతో మాట్లాడించే టూల్స్‌పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్‌ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)

జస్టిన్‌ హారిసన్‌ స్టార్టప్‌ ‘అండ్‌ యూ’ యూజర్‌లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్‌ సృష్టించిన ఏఐ–పవర్డ్‌ ఆడియో వెర్షన్స్‌ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)

‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత  ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్‌ హరిసన్‌.

చనిపోయిన వారితో ‘జూమ్‌ కాల్‌’లాంటి  సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్‌లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్‌’ స్టార్టప్‌. కీర్తిశేషుల ఏఐ అవతార్‌లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్‌బాట్స్‌’ స్టార్టప్‌లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)