Breaking News

ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఈ 'పెనా ప్యాలెస్‌' కూడా..

Published on Sun, 07/07/2024 - 05:27

ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో పెనా ప్యాలెస్‌ ఒకటి. ఇది పోర్చుగల్‌ వైభవాన్ని  కళ్లకు కడుతుంది. హంగు, ఆర్భాటాలతో ఉండే ఈ ప్యాలెస్‌ను 1838లో కింగ్‌ ఫెర్డినాండ్‌ 2 తన వేసవి విడిది కోసం కట్టించాడట. ఇది ప్రష్యన్‌ వాస్తుశిల్పి ‘లుడ్విగ్‌ వాన్‌ ఎష్పెజ్‌’ ఆలోచనలకు రూపం.

ఆ కట్టడం మూరిష్, మాన్యులైన్‌ వంటి ఎన్నో నిర్మాణ శైలుల సమ్మేళనంతో.. గులాబీ, పసుపు రంగుల్లో ఆకట్టుకుంటుంది. ఇది గోపురాలు, మూరిష్‌ కీహోల్‌ గేట్స్, టవర్స్‌ ఇలా చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో విలువైన పింగాణీ, పోర్చుగీస్‌ శైలి ఫర్నిచర్‌తో కళ్లు తిప్పుకోనివ్వదు.

దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూంటారు. ఆ నిర్మాణం.. ఎత్తైన కొండలపై.. దట్టమైన చెట్ల మధ్య ఉండటంతో ప్రకృతి కూడా ఆ ప్యాలెస్‌ అందాన్ని రెట్టింపు చేస్తోంది. చుట్టూ పొగమంచు, చల్లని వాతావరణం.. ఆ ప్యాలెస్‌కి అదనపు సొగసులు!

ఇవి చదవండి: ప్లాస్టిక్‌ ట్యూబ్స్‌ డిస్పెన్సర్‌ హోల్డర్‌..

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)