Breaking News

దోస ప్రింటింగ్‌ మెషీన్‌ : వైరల్‌ వీడియో

Published on Sat, 11/16/2024 - 10:38

‘దోసెలందు డెస్క్‌టాప్‌ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్‌బాగ్‌ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్‌ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్‌’ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్‌ మెషీన్‌తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్‌’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్‌తో మోహిని అనే యూజర్‌ పోస్ట్‌ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన  పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ‘ది డెస్క్‌ టాప్‌ దోశ’ అనే కాప్షన్స్‌తో ఈ వీడియోను  రీపోస్ట్‌ చేశారు.

ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్‌ యజమాని మెషిన్‌లోని ఐరన్‌ ప్లేట్‌పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్‌ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్‌ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్‌ వచ్చి రోల్‌ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.

 ఇక సోషల్‌ మీడియావాసుల రెస్పాన్స్‌ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్‌ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది.

 

కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!

‘ఇంతకీ ఈ మెషిన్‌ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్‌ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’  అని చెబుతాడో... వేచి చూడాల్సిందే.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)