Breaking News

కోరిక కాదు ఓపిక కావాలి.. ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Published on Mon, 01/27/2025 - 14:48

ఒకప్పుడు ఋషులు, మునీశ్వరులు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శనభాగ్యం కోసం యోగముద్రలో, ధ్యానంలో ఉండేవారు. సృష్టికర్త దర్శనమిచ్చేంతవరకు వారి కార్యదీక్ష భగ్నం చేసుకునే వారు కాదు. వారి పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది.

రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువై పోయాయి. కోరికలు తోడయ్యాయి. దైవపూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు.   మనిషి తలరాతను రాసింది ఆయనే కదా!

కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాస్తాడు. మంచి అయినా, చెడు అయినా జరిగి΄ోతూనే వుంటాయి. బ్రహ్మ రాతను మార్చటం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అలాంటి  పాప, పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్త్రదానాలు, నిలువుదోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు.  మనం మానవమాత్రులం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోర్కెలు ఉండటం సహజం. (చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్‌..!)

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలూ  నేర్చుకుంటాడు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారున్ని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీ కృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడు వరం కోరుకొమ్మంటే ఏమీ  పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావికన్నా మామూలు మనుషులం మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇక ΄ాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే..

ఇదీ చదవండి: శానిటరీ ప్యాడ్‌ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం

భక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయ్‌. మొలకలను తినాలని పక్షులు చూస్తాయ్‌.  మొక్కని తినాలని పశువులు చూస్తాయ్‌. అన్నిటినీ తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్‌. జీవితం కూడా అంతే! వచ్చేవరకు వేచివుండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే...

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు