Breaking News

తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్‌

Published on Mon, 05/05/2025 - 14:59


విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో  విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న  ఢిల్లీ నుంచి షిర్డీ  వెళ్లే 6E 6404  ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు  మేరకు  శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్  తన మేనేజర్‌కు సమాచారం అందించింది.  దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.

రహతా పోలీస్ స్టేషన్‌లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.  వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది.  ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)