Breaking News

మధుమేహాన్ని తగ్గించే పరివృత్త త్రికోణాసనం..

Published on Sat, 07/25/2026 - 09:41

శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.

చేసే విధానం...

  • ముందుగా మ్యాట్‌పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.

  • రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.

  • కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.

  • రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.

  • శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.

  • ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.

  • కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.

  • వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.

  • శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.

  • ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.

ప్రయోజనాలు...

  • బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.

  • వెన్నెముకకు మంచి ట్విస్ట్‌ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

  • కాళ్లు, తుంటి, హ్యామ్‌స్ట్రింగ్స్‌ బలపడతాయి.

  • జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

  • పొత్తికడుపు అవయవాలకు మసాజ్‌ లభిస్తుంది.

  • నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.

  • శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.

  • ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.

  • భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.

  • పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

  • కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.

జాగ్రత్తలు...

  • తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్‌ డిస్క్‌ ఉన్నవారు చేయ కూడదు.

  • మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.

  • గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.

  • భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.

  • ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.

  • 2–3 రౌండ్లు సాధన చేయాలి.
    - అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)